Thursday, March 13, 2025

National Games | జాతీయ క్రీడ‌ల్లో నందినికి బంగారు పథకం

National Games | జాతీయ క్రీడ‌ల్లో నందినికి బంగారు పథకం
అథ్లెట్ లో హెప్టాతలాన్ విభాగంలో సత్త చాటిన ఎస్సీ గురుకుల డిగ్రీ విద్యార్థిని
Hyderabad : ఉత్తరాఖండ్ రాష్టంలోని డెహ్రాడూన్ లో గత నెల ఫిబ్రవరి 8 వ తేదీ నుండి 12 వరకు నిర్వహించిన 38 వ జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో తెలంగాణ రాష్టానికి చెందిన సంగారెడ్డి జిల్లా బుదేరా సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలకు చెందిన ఆగ‌సారా నందిని బంగారు ప‌థ‌కం సాధించింది. ఆమె బ్యాచులర్ అఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ( BBA ) ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఈ జాతీయ క్రీడలలో 38 జట్లకు ప్రాతినిధ్యం వహించాయి. ఇందులో దాదాపు 10,000 మంది అథ్లెట్లు, అధికారులు పాల్గొన్నారు. హరిద్వార్, నైనిటాల్, హల్ద్వానీ, రుద్రపూర్, శివపురి, న్యూ టెహ్రీ అనే ఆరు నగరాల్లో పోటీలు జరిగాయి. అథ్లెటిక్స్, షూటింగ్, రెజ్లింగ్, స్విమ్మింగ్, హాకీ, బాక్సింగ్, బ్యాడ్మింటన్, వెయిట్ లిఫ్టింగ్, ఫుట్‌బాల్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్ వంటి ఒలింపిక్ క్రీడలను కుడా నిర్వహించారు. భారతదేశంలోని అన్ని రాష్టాలనుండి క్రీడా కారులు ఈ పోటీల్లో పోటీపడగా కేవలం 10 మందికి మాత్రమే ఫైనల్ లో పోటీ పడేందుకు అర్హత సాధించారు. ఇక ఫైనల్ పోటీల్లో అగసారా నందిని బంగారు పథకాన్నికైవసం చేసుకొంది. ఇది చాలా గొప్ప విష‌యం. అథ్లెట్ లో హెప్టాతలాన్ విభాగంలో నందిని తన సత్త చాటింది. అయితేహెప్టాతలాన్ లో మొత్తం ఏడు రకాల ఈవెంట్స్ ఉంటాయి. వీటిలో.. 1) 100 మీటర్ల హర్డిల్స్, 2) హై జంప్, 3) షార్ట్ ఫుట్, 4) 200 మీటర్స్, 5) జావెలిన్ త్రో. 6) లాంగ్ జంప్, 7) 800 మీటర్స్ .. ఉన్నాయి. ఈ విధంగా ఏడు ఈవెంట్ల‌ లో పూర్తిగా పైచేయి సాధిస్తేనే క్వాలిఫై అవుతారు. అయితే ఇలా మొత్తం ఏడు ఈవెంట్స్ లో నందిని తన సత్తా చాటి మొదటి స్థానంలో నిలవడంతో గోల్డ్ మెడల్ సాధించింది.
ఈ సందర్బంగా TGSWREIS కార్యదర్శి డా విఎస్ అలగు వర్షిణి మాట్లాడుతూ .. గురుకులాల విద్యార్థులు కేవలం చదువు మాత్రమే కాకుండా, క్రీడల్లో కూడా తమ ప్రతిభను ప్రదర్శించి, విజయం సాధించవచ్చు అని స్పష్టమైన సందేశం ఇచ్చార‌ని అభిప్రాయపడ్డారు. క్రీడలు, విద్యతో పాటు, శరీర ప్రేరణను, నైపుణ్యాలను, సహనాన్ని పెంచేందుకు ఎంతో దోహదపడతాయన్నారు. సాంఘిక సంక్షేమ గురుకులాలను మరింత తీర్చిదిద్దెందుకు సీఎం రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. యువతను క్రీడలో పాల్గొనేందుకు ఎంతో ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. క్రీడా కారులకు కావాల్సిన తర్ఫీదు ఇచ్చేందుకు కోచ్ లను వారికీ కావాల్సిన వసతులను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అలగు వర్షిణి చెప్పారు.
గోల్డ్ మెడల్ అందుకోవడం పట్ల నందిని త‌న‌ సంతోషం వ్యక్తం చేసారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు అన్నిరకాలుగా సహకరించిన గురుకుల కార్యదర్శి డా విఎస్ డా విఎస్ అలగు వర్షిణి మేడం కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మా కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులతో పాటు కోచ్ త‌న‌ను ప్రోత్సహించి ఈ ఈవెంట్స్ లో పాల్గొనేలా కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.
* * *

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles