Monday, December 15, 2025

Shamerpet Police Station |శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ కు తెలంగాణలో నంబ‌ర్ వ‌న్

Shamerpet Police Station |శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ కు తెలంగాణలో నంబ‌ర్ వ‌న్
*దేశంలో ఏడోవ‌ ర్యాంక్‌
*తెలంగాణలోఉత్తమ పోలీస్ స్టేషన్‌గా మెరిసిన శామీర్ పేట పోలీస్ స్టేషన్
**దేశవ్యాప్తంగా కేంద్ర హోంశాఖ ఎంపిక

Vikasamnews/ Hyderabad : దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎంపిక చేసిన ఉత్తమ పోలీస్ స్టేషన్లలో శామీర్పేట్ పోలీస్ స్టేషన్ ఏడోవ‌ స్థానాన్ని, తెలంగాణలో మొదటి స్థానాన్ని సాధించింది. పోలీస్ స్టేషన్ పనితీరు, రికార్డుల నిర్వహణ, బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం, ఫిర్యాదులకు సమయానుకూల పరిష్కారం చూపించడం వంటి అంశాలను ఎంహెచ్ (MHA) పరిగణనలోకి తీసుకుంది. అలాగే స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, గార్డెనింగ్, ఉత్తమ CCTNS పని, సిబ్బంది నైపుణ్యం వంటి అంశాలు కూడా పరిశీలనలో ఉన్నాయి. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా 10 ఉత్తమ పోలీస్ స్టేషన్లను ఎంపిక చేసే ఈ ప్రక్రియలో, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన శామీర్ పేట్‌ పోలీస్ స్టేషన్ రాష్ట్రంలో అగ్రస్థానాన్ని, దేశంలో ప్రతిష్టాత్మకమైన ఏడోవ‌ ర్యాంకును సాధించడం విశేషం. ఈ సందర్భంగా మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి, ఏడీసీపీ మేడ్చల్ పురుషోత్తం, ఏసీపీ మేడ్చల్ బాలగంగిరెడ్డి, శామీర్పేట్ ఇన్స్ పెక్ట‌ర్‌ శ్రీనాథ్‌తో పాటు సిబ్బందిని అభినందించారు.
* * *

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles