Tribal University VC YL Srinivas | సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన గిరిజన వర్సిటీ వీసీ వై ఎల్ శ్రీనివాసరావు
త్వరలోనే బాధ్యతలు స్వీకరణ
Hyderabad : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆదివారం జూబ్లీహిల్స్ నివాసంలో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ వైఎల్ శ్రీనివాస్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన సీఎంకు మొక్క బహుమానంగా ఇచ్చారు. రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీకి నూతన వైస్ ఛాన్స్ లర్‌గా ప్రొఫెసర్ వైఎల్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్రం నుంచి ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి యూనివర్సిటీకి సంబంధించి అంశాలపై చర్చించారు. ఆయన త్వరలోనే వీసీగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఆయన తెలిపారు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీతో పాటు ఇంగ్లీష్ అండ్ ఫారిన్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ డిపార్టుమెంట్‌లో విద్యాబోధన చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోరా యూనివర్సిటీలో తన సేవలు అందిస్తున్నారు. గిరిజన యూనివర్సిటీ వీసీగా అవకాశం రావడంతో ఆయన త్వరలో ఆ బాధ్యతలు స్వీకరించనున్నారు.
* * *