CM – PALAMURU | పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత నాది
*ఈ జిల్లా నుంచి 12 నుంచి ఎమ్యెల్యేలను అందించి అశీర్వదించారు
* కేసీఆర్‌ను పాలమూరు ఆదరించింది
* కానీ, పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేయలేదు
* పదేండ్లలో నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలన్న ఆలోచన చేయలేదు
* మక్తల్ బహిరంగ సభలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి..
Vikasamnews/ Hyderabad : పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను అని, ఈ జిల్లా నుంచి 12 మంది ఎమ్మెల్యేలను అందించి ఆశీర్వదించారు అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మక్తల్‌లో సోమవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తమ ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా ఇవాళ తమ ముందు నిలబడ్డాను, పాలమూరు గడ్డ ప్రేమిస్తే ప్రాణమిస్తుంది.. మోసం చేస్తే పాతాళానికి తొక్కుతుంది అని నిరూపించారని ఆయన పేర్కొన్నారు. ఆనాడు పాలమూరులో ఊరు లేకపోయినా కెసీఆర్ ను ఈ గడ్డ ఆదరించిందని సీఎం చెప్పొకొచ్చారు. కానీ, పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి సంగం బండను పగలగొట్టేందుకు రూ. 12 కోట్లు కూడా ఇవ్వలేదు అని విమర్శించారు. పదేండ్లలో పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేయలేదని దుయ్యబట్టారు. పదేళ్లలో నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలన్న కనీస ఆలోచన చేయలేదని మండిపడ్డారు. ప్రజా ప్రభుత్వంలో పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేసుకునేందుకు అడుగులు వేస్తున్నామని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే పనులు మొదలు పెట్టాలని ప్రయత్నిస్తే కోర్టులో కేసులు వేసి ఏడాదిన్నర పనులు జరగకుండా ఆపారన్నారు. ఏ రైతుకు నష్టం జరగవద్దని ఎకరానికి రూ. 20 లక్షలు ఇచ్చి, 96 శాతం రైతులను ఒప్పించి భూసేకరణ చేశామని పేర్కొన్నారు.
నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు భూసేకరణ పూర్తి చేసి, ఇప్పుడు పనులు మొదలు పెట్టుకోబోతున్నామని సీఎం తెలిపారు. పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నాడు అని, ప్రతీ పేదవాడికి విద్య అందించాలన్న ఉద్దేశంతోనే విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు. ప్రతీ నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని, పార్టీల గురించి ఆలోచన చేయలేదు, జెండాలు ఎజెండాలు చూడలేదు, పాలమూరు అభివృద్ధి లక్ష్యంగా జిల్లాలో 14 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నట్టు ఆయన చెప్పారు.
* జిల్లాలో ఐఐటీ ఏర్పాటు చేస్తున్నామని, దేశానికి పాలమూరు జిల్లా ఆదర్శంగా ఉండాలనేదే వారి ఆకాంక్ష అని, తమ చేతికి ఓటు వేసి గెలిపిస్తే అభయహస్తమై తమరి జీవితాల్లో వెలుగులు నింపుతోందని అన్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని,
200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, రేషన్ కార్డుల ద్వారా పేదలకు సన్న బియ్యం అందిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. అలాగే రైతు రుణమాఫీ చేసి, రైతులను రుణ విముక్తులను చేశామని తెలిపారు. రెండేంళ్లల్లో రైతులకు 1 లక్ష 4 వేల కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. మహిళల ఆర్ధిక అభివృద్ధికి కృషి చేస్తున్నామని, కులగణన చేసి బలహీన వర్గాల లెక్క తేల్చామన్నారు. ఇక ఎస్సీ వర్గీకరణ చేసి చూపించామన్నారు. ఒకవైపు కెసీఆర్ చేసిన రూ. 8 లక్షల కోట్ల అప్పును చెల్లిస్తూ, పాలమూరు అభివృద్ధికి తమ బిడ్డగా కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రాన్ని గాడిన పెట్టి అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఈ నెల 8, 9 న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని చెప్పారు. తెలంగాణ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటుతున్నామని,
2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఏకానమీగా తీర్చి దిద్దుతామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
*పంచాయతీ ఎన్నికలు వచ్చాయి..
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు వచ్చాయని, కాళ్లల్లో కట్టెలు పెట్టే వాళ్ళను కాదు.. అభివృద్ధిని కోరుకునేవారిని ఎన్నుకోవాలి అని ప్రజలకు పిలుపునిచ్చారు. మంచి వాళ్లను సర్పంచులుగా ఎన్నుకోవాలి అని, తమ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి అని కోరారు. తమకు నీళ్లు, నిధులు ఇచ్చే బాధ్యత నాదన్నారు. పదేళ్లలో పాలమూరును పసిడి పంటల పాలమూరుగా అభివృద్ధి చేసుకుందాం.
* * *