Wednesday, March 18, 2026

Degree New Courses In Telanga | డిగ్రీలో జాబ్ ఓరియంటెండ్ కోర్సులు..

Degree New Courses In Telanga | డిగ్రీలో జాబ్ ఓరియంటెండ్ కోర్సులు..
* సాంప్ర‌దాయ కోర్సుల‌కు స్వ‌స్తి ప‌లుక‌నున్న విద్యా శాఖ‌
* యువ‌త‌కు ఉద్యోగ‌, ఉపాధే ల‌క్ష్యంగా నూత‌న కోర్స‌ల విధానానికి శ్రీ‌కారం
Vikasamnews.com/Hyderabad : తెలంగాణ రాష్ట్రంలో నూత‌న డిగ్రీ కోర్సుల‌కు విద్యా శాఖ శ్రీ‌కారం చ‌ట్టుంది. గ‌త కొన్నేండ్లుగా కొన‌సాగుతున్న సాంప్ర‌దాయ‌క డిగ్రీ కోర్సుల‌కు బ‌దులుగా నూత‌న కోర్సుల‌ను ప్రైవేశ పెట్ట‌బోతుంది. కొత్త‌గా అందుబాటులోకి తీసుకున్న ఈ డిగ్రీ కోర్సుల‌లో కేవ‌లం చ‌దువుకోవ‌డానికి మాత్ర‌మే కాకుండా, ఉద్యోగ‌, ఉపాధి ల‌క్ష్యంగా నూత‌న కోర్సుల‌ను నిర్మిస్తున్నారు. ముఖ్యంగా మెరైన్ రంగంలో విస్త్ర‌త స్థాయిలో ఉద్యోగ అవ‌గ అవ‌కాశాలు ఉన్నాయి. అలాగే డిఫెన్స్ రంగంలో కూడా పుష్క‌లంగా ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ రెండు రంగాల‌కు కావాల్సిన డిగ్రీలో మాత్రం అందుబాటులో లేవు. ఆ గ్యాప్‌ను గ‌ర్తించిన రాష్ట్ర ఉన్న‌త విద్యా మండ‌లి, రంగాల‌లో డిగ్రీలో స్థాయిలోనే కొత్త కోర్సుల‌ను ప‌రిచ‌యం బోతుంది. అయితే వచ్చే విద్యాసంవత్సరం నుంచి 30 కొత్త కోర్సులను ప్రవేశపెట్టనుండగా, ప్రభుత్వ, ప్రైవేట్‌ కాలేజీలు పోటీలు ప‌డుతున్నాయి. ఇప్పటి వరకు 120 కాలేజీలు కొత్త కోర్సులు ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతూ మండలికి దరఖాస్తు చేసుకున్నారు. 2026-27 విద్యాసంవత్సరంలో డిగ్రీలో 19, పీజీలో 11 చొప్పున మొత్తం 30 కొత్త కోర్సులను ఉన్నత విద్యామండలి అందుబాటులోకి తీసుకువ‌స్తుంది. ఈ కోర్సులను ప్రవేశపెట్టే కాలేజీలు ముందు సంబంధిత పరిశ్రమలు/సంస్థలతో ఎంవోయూ కుదుర్చుకోవాలి ఉంటుంది. ఇలాంటీ డిగ్రీ కోర్సులో ప్రైవేశాలు పొందిన‌ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ కల్పించాల్సి ఉంటుంది కాబ‌ట్టి. అలాగే కోర్సు పూర్తైన తర్వాత ప్లేస్‌మెంట్‌ కల్పించాలి. ఇలాంటి ప్రత్యేకతలు గల కోర్సులు నిర్వహించేందుకు కాలేజీలు పోటీపడుతున్నాయి. అయితే ఈ కొత్త కోర్సుల అనుమతి విషయంలో మండలి అధికారులు ప‌లు ర‌కాల జాగ్రత్త చర్య‌లు తీసుకుంటున్నారు.
*  డిగ్రీలోనీ కొత్త కోర్సులపై మంగళవారం కాలేజీలు, ఫ్యాకల్టీ, విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. టీసాట్‌లో మధ్యా హ్నం 3 నుంచి 5గంటల వరకు కొత్తకోర్సుల ప్రత్యేకతలు, లాభాలపై ఉన్నత విద్యామండలి చైర్మన్‌ బాలకిష్టారెడ్డి, వైస్‌ చైర్మన్లు ఎస్కే మహమూద్‌, ఇటికాల పురుషోత్తం, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్‌ వివరిస్తారు. ఈ కోర్సుల నిర్వహణపై సూచనలు స్వీకరిస్తారు. కొత్త కోర్సులకు అనుమతి ఇచ్చిన తర్వాత ఆయా కాలేజీలకు మరోసారి ఓరియంటేషన్‌ నిర్వహిస్తారు. ఈ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు ఉద్యోగాలు ఇప్పించే పూర్తి బాధ్యత కాలేజీలదేనని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ వీ బాలకిష్టారెడ్డి తెలిపారు. కాలేజీలు బాధ్యత తీసుకొని విద్యార్థులకు ఉద్యోగాలు ఇప్పించాల్సి ఉంటుందని ఆయ‌న సూచించారు. కొత్త కోర్సులను ప్రవేశపెట్టడం, క్లాసులు, పరీక్షలు పెట్టి విద్యార్థులను నిరుద్యోగులుగా మార్కెట్లోకి పంపిస్తామంటే తాము ఊరుకోబోమని హెచ్చరించారు. కోర్సులకు అనుమతి ఇచ్చేటప్పుడే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని కాలేజీ యాజమాన్యాలకు వివరించి, ఆ తర్వాతే కాలేజీలకు అనుమతించనున్నట్టు తెలిపారు.
* కొత్త కోర్సుల వివ‌రాలు..
List of Revised Suggestive Innovative Courses
UG Courses:
1. BA – Defence & Security Studies
2. BA – Land, Agriculture & Rural Development
3. BBA – Hospital Administration & Health Management
4. BBA – Airport, Airline, Airspace & Air Traffic Management
5. BBA – Maritime Technology, Commerce & Management
6. BBA – Food Technology, Food Security & Management
7. BBA – Travel, Tourism & Hospitality Management
8. B.Com – Finance Technology
9. B.Com – International Banking, Finance & Accounts
10. B.Com – e-Commerce, m-Commerce & Digital Marketing
11. B.Sc – Multi-Media & Animation (only for Visual Arts Colleges)
12. B.Sc – Data Science & Artificial Intelligence
13. B.Sc – Climate Science & Environmental Studies
14. B.Sc – Instrumentation (Honours) 4 years
15. B.Sc – Bio-Informatics (Honours) 4 years
16. B.Sc – Bio-Medical Sciences (Honours) 4 years
17. B.Sc – Medical Microbiology (Honours) 4 years
18. B.Sc – Bio-Technology, Chemistry, Genetics, Botany/MicroBiology/Zoology/Bio- Chemistry/Chemistry/ Nutrition & Dietetics /
Food Science (Any 3 Subjects)
19. B.Sc – Computer Science & Cyber Security/ Artificial Intelligence & Machine
Learning/Robotics/Mathematics/Statistics/Data Science(3 Subjects)
PG Courses:
20. M.A – Advance Defence & Security Studies
21. M.A – Land Governance, Agriculture & Rural Development
22. MA – Advance Hospital Administration & Health Management
23. MA – Maritime Technology & Maritime Governance
24. MA – Travel, Tourism & Hospitality Management
25. MA – Advance Airport, Airline, Airspace & Air Traffic Management
26. M.Com – Finance Technology and Emerging Challenges
27. M.Sc – Climate Science & Environmental Studies
28. M.Sc – Medical Microbiology
29. M.Sc – Medical Immunology
30. M.Sc – Cyber Security
AEDP Courses
31. BBA/ B.Com – Retail Operations
32. BBA / B.Com – Logistics
33. BBA / B.Com – E – Commerce Operations
34. BBA / B.Sc – Healthcare Management
35. BBA / B.Sc – Tourism & Hospitality Operations
36. B.Com – BFSI
37. B.Com – Human Resource Operations
38. B.Sc – Pharmaceutical Manufacturing and Quality
39. B.Sc – Digital Marketing & Advertising
40. B.Sc – Industrial Electronics
41. B.Sc – Digital Electronics
*   *   *

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles