Tamilnadu Power Subsidy | టీస్టాళ్లలో విద్యుత్ స్టౌవ్‌లు ఉపయోగించండి..
– ఒక యూనిట్‌కు రూ.2 సబ్సిడి ఇస్తాను
-కీలక నిర్ణయం తీసుకున్న తమిళనాడు సర్కారు
Vikasamnews.com/Hyderabad : ప్రపంచంలో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరుపుతున్న యుద్ధం కారణంగా తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ యుద్ధం ఫలితంగా ఇతర దేశాలతోపాటు భారత్‌లో కూడా కమర్షియల్ వంట గ్యాస్ కొరత ఏర్పడింది. దాంతో దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతపడ్డాయి. ఇప్పటికే అనేక హోటళ్లు ఈ విషయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన సీనియర్ అధికారులు సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నారు. టీస్టాళ్లు, హోటళ్లు, రెస్టారెంట్‌లు, క్లౌడ్ కిచెన్ సహా ఆహార తయారీ కేంద్రాలు ఏవైనా ఎల్పీజీకి బదులుగా ఎలక్ట్రిక్ స్టౌవ్‌లను ఉపయోగిస్తే.. ఒక యూనిట్ విద్యుత్‌పై రూ.2 సబ్సిడీ అందించనున్నట్లు ప్రకటించారు. వంట గ్యాస్ సంక్షోభం ఏర్పాటు సందర్భంగా వంట కోసం గ్యాస్‌కు బదులుగా విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆధ్వర్యంలో తమిళరాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాణిజ్య సిలిండర్ల కొరత తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో వంటగ్యాస్ కొరత తీవ్రత తగ్గేవరకు సబ్సిడీ వర్తిస్తుందని తమిళనాడు అధికారులు ప్రకటించారు.
* * *


