Rs.2500 New Cash Scheme at Delhi | మహిళలకు ప్రతి నెల రూ.2500 నగదు
కొత్త పథకాన్ని ప్రకటించిన ఢిల్లీ కొత్త సీఎం రేఖా గుప్తా
క్యాబినెట్‌లో ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రతిపక్ష పార్టీ ఆప్ విమర్శ
Hyderabad : ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి అసెంబ్లీ సమావేశంలో ఈ నెల 24 (సోమవారం) నుంచి ప్రారంభం అయ్యాయి. తొలి సమావేశాల్లోనే కొత్త సీఎం రేఖా గుప్తతో పాటు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఆప్ పార్టీ తరుపున ప్రతిపక్ష నేతగా మాజీ సీఎం అతిషి ఎన్నికయ్యారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో మహిళకు నెలకు రూ.2500 నగదు ఇవ్వనున్నట్లు కొత్త సీఎం గుప్తా కీలక ప్రకటన చేశారు. మహిళలకు రూ.2500 పథకం అమలు చేయడమేనని తమ ప్రభుత్వ ప్రాధాన్యం అని స్పష్టం చేశారు. అయితే గత సర్కారు ఖజానా ఖాళీ చేసినందువల్ల ఈ పథకం కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు ఈ సందర్భంగా సీఎం తెలిపారు. అయితే దీనినై క్యాబినేట్ సమావేశంలో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోక పోవడంతో ఆప్ ప్రతిపక్ష పార్టీ నేత విమర్శలు చేసింది. అయితే ఎన్నికల హామీలు మాత్రం అధికార పార్టీ మరిచినట్లు మండిపడింది. అయితే నగదు పథకం అమలు అంశంపై అధికారి పార్టీ చివరకు ఏం నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆందోళనల మాత్రం ఢిల్లీ ప్రజలకు కలుగుతుంది.
* * *