Cricket News | న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం
ఆసీస్ తో భారత్ సెమీస్ మ్యాచ్
Hyderabad : దుబాయ్ లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో లీగ్ దశను టీమ్ ఇండియా ఓటమి లేకుండా ముగించింది. ఇప్పటికే సెమీస్ చేరిన భారత జట్టు.. ఆదివారం న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో గ్రూప్ -ఎ లో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా మంగళవారం (మార్చి 4) జరిగే తొలి సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో భారత స్పిన్నర్ల ధాటికి న్యూజిలాండ్ 45.3 ఓవర్లలో 205 పరుగులకే కుప్పకూలింది. కేన్ విలియమ్సన్ (81; 120 బంతుల్లో 7 ఫోర్లు) ఒక్కడే పోరాడాడు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (5/42) అదరగొట్టాడు.
* * *