Oscar Awards 97 | సిని నటులకు ఆస్కార్ అవార్డులు
– లాస్ ఏంజిల్స్‌లో అట్టహాసంగా ప్రారంభమైన అవార్డులు ప్రదాన ప్రక్రియHyderabad : అంతర్జాతీయ చలన చిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ (Oscar Awards) అవార్డు ప్రకటించారు. అయితే ఈ అత్యున్నత స్థాయి అవార్డును ఒక్కసారైనా అందుకోవాలని ప్రతీ నటుడు, ఆర్టిస్ట్‌తో పాటు టెక్నీషన్ అందరూ అభిలషిస్తారు. అలాంటి అవార్డుల ప్రదానోత్సవం అంగరంగం వైభవంగా ప్రారంభమైంది.
ఈ మేరకు అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా కొనసాగుతున్నది. 97వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ వేడుకకు సినీ తారలతోపాటు టెక్నీషియన్లు సర్వం హాజరయ్యారు. ఉత్తమ సహాయ నటుడితో మొదలైన అవార్డుల ప్రదానోత్సవం ఉత్తమ చిత్రం తో ముగియనుంది. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా నటి అమేలియా డిమోల్డెన్‌బర్గ్ వ్యవహిస్తున్నారు.
* 97వ ఆస్కార్ అవార్డులు వివరాలు ఇలా..
ఉత్తమ సహాయ నటుడు- కీరన్ కైల్ కల్కిన్ (ది రియల్ పెయిన్)
ఉత్తమ సహాయ నటి- జోయ్ సాల్దానా (ఎమిలియా పెరెజ్)
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్- ఫ్లో
ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్- ఇన్ ది షాడో ఆఫ్ ది సైప్రెస్
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్- పాల్ తాజ్‌వెల్ (వికెడ్)
ఉత్తమ మేకప్, హెయిర్ స్టైల్- ది సబ్‌స్టాన్స్
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే- సీన్ బేకర్ (అనోరా)
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే- కాన్‌క్లేవ్ (పీటర్ స్ట్రాగన్)
ఉత్తమఒరిజినల్ సాంగ్- ఎల్ మల్ (ఎమిలియా పెరెజ్)
ఉత్తమ ఎడిటింగ్- సీన్ బీకర్ (అనోరా)
మేకప్, హెయిర్ స్టైలింగ్- ది సబ్ స్టాన్స్
ఉత్తమ ప్రొడక్షన్ డిజైనింగ్- విక్డ్
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్- డూన్ 2
ఉత్తమ సౌండ్- డూన్ 2
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్- నో అదర్ ల్యాండ్
ఉత్తమ యాక్షన్ షార్ట్ ఫిల్మ్- ఐయామ్ నాట్ ఏ రోబోట్
ఉత్తమ ఒరిజినల్ సాంగ్- ఎల్ మల్
- * *