Friday, March 14, 2025

BRS President Kcr | మహిళల భాగస్వామ్యంతోనే తెలంగాణ ప్రగతి

BRS President Kcr | మహిళల భాగస్వామ్యంతోనే తెలంగాణ ప్రగతి
మహిళాసాధికారతకు బిఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట
మహిళలే కేంద్రంగా నాటి పథకాల అమలు
అదే స్ఫూర్తిని కొనసాగించాలె
మహిళలకు మహిళాదినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఎస్ అధినేత కేసీఆర్‌
Hyderabad : రాష్ట్ర మహిళలకు బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్త్రీశక్తి ని కొనియాడారు. మ‌హిళ‌ల భాగ‌స్వామ్యంతోనే తెలంగాణ ప్ర‌గ‌తి సాధించిన‌ట్లు పేర్కొన్నారు. మ‌హిళ‌ల‌కు బీఆర్ఎస్ పెద్ద పీట వేసింద‌న్నారు. కుటుంబ వ్యవస్థను ముందుకు నడపడంలో మహిళల త్యాగం మహోన్నతమైనదన్నారు. దేశ సంపదను సృష్టించడంలో పౌరులుగా వారి పాత్ర ఎంతో గొప్పదని కొనియాడారు. ఎన్నో కష్టాలను అధిగమిస్తూ పురుషుడితో సమానంగా నేటి సమాజంలో స్త్రీ పోశిస్తున్న పాత్ర అమోఘమని తెలిపారు. అవకాశాలిస్తే అబల సబలగా నిరూపించుకుంటుందన్నారు. పదేండ్ల బిఆర్ఎస్ పాలనలో రాష్ట్ర మహిళాభ్యున్నతికోసం అమలు చేసిన పలు కార్యక్రమాలు వారి సాధికారతకు దోహదం చేశాయ‌ని ఈ సంద‌ర్భంగా కేసీఆర్ గుర్తు చేశారు. మహిళల ఆరోగ్యం, సంరక్షణ, సంక్షేమం తో పాటు పలు కీలక అభివృద్ధి పథకాలల్లో మహిళకే ప్రాధాన్యతనిచ్చామన్నారు. వారి కేంద్రంగానే పథకాలను అమలు చేశామని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రగతిలో మహిళలను బిఆర్ఎస్ ప్రభుత్వం భాగస్వామ్యం చేసిందన్నారు. అదే స్పూర్థిని కొనసాగిస్తూ మహిళాసాధికారతకు ప్రాధాన్యతనివ్వాలని, వారిని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దడం ద్వారానే తెలంగాణ అభివృద్ధి మరింత ముందుకు సాగుతుందని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.
* * *

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles