CM Revanth Reddy | సాధికారత, లింగ సమానత్వం దిశగా సర్కారు అడుగులు
కోటీ మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి
Hyderabad : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి రాష్ట్ర మహిళలందరికీ తన హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సాధికారత, లింగ సమానత్వం సాధించే దిశగా ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నింటిలోనూ మహిళలకే ప్రథమ ప్రాధాన్యతనిస్తోందని గుర్తుచేశారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు పేర్కొన్నారు. సృష్టికి మూలం, జగతికి ఆధారం, అలుపెరగని శ్రమతత్వంతో పనిచేస్తున్న నారీశక్తికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక వందనాలు తెలియజేశారు.
* * *