Congress leader Jaggareddy | సినిమాలోకి కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు నేపథ్యంలో షాక్‌కు జగ్గారెడ్డి
తన ఒరిజినల్ క్వారెక్టర్‌తో ఇక సినిమా తీస్తా అని ప్రకటన
ఏడాదిలోగా సినిమా షూటింగ్ పూర్తి
మీడియా చిట్‌చాట్‌లో వెల్లడి
సినిమాలో పాత్ర ఎలాంటిదో అని ఆసక్తిగా పెంచుకుంటున్న తెలంగాణ ప్రజలు
Hyderabad : రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి త్వరలో సినిమాల్లోకి రంగ ప్రవేశం చేయబోతున్నారా? అంటే అవుననే చెప్పుతున్నారు. ఈ మేరకు సోమవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన సినిమా ఎంట్రి గురించి తన మనుసులో మాట బయటపెట్టారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక నేపథ్యంలో ఊగి పోతున్న జగ్గారెడ్డి.. ఈ మేరకు సినిమా రంగం ప్రవేశం గురించి ప్రస్తావించడం ఆసక్తి కరంగా మారింది. అయితే తాను లవ్ స్టోరీలో స్పెషల్ రోల్ లో నటించనున్నానని, తన ఒరిజనల్ క్యారెక్టర్ కు సినిమాలోని రోల్ అద్దం పట్టనుందని, అందుకే సినిమాలో నటించనున్నట్లు తెలిపారు. పీసీసీ, సిఎం ల అనుమతి తోనే సినిమాలో నటిస్తాని పేర్కొన్నారు. ఈ ఉగాది పండగ సందర్భంగా సినిమా స్టోరీ వింటానని, అది వచ్చే ఉగాదికి సినిమా విడుదల కానుందని పేర్కొన్నారు. ఒక వ్యక్తి తనను కలిసి, తన క్యారెక్టర్ కు తగ్గట్టుగా క్యారెక్టర్ ఉన్న సినిమా ఉందని తనకు చెప్పాడని, అందుకోసం తన సినిమాలో నటించమని అడిగారని జగ్గారెడ్డి తెలిపారు. సినిమా ఇంటర్వల్ ముందు మొదలయ్యే తన పాత్ర, సినిమా చివరి వరకు ఉంటే రక రకాల సన్నివేశాలలో తన పాత్ర ఉంటుందని తెలిపారు. తాను నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగానే సినిమాతో నటిస్తానని పేర్కొన్నారు. ఆ సినిమాలో తనది ఒక ప్రత్యేక పాత్ర అన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు కాంగ్రెస్ పార్టీ అధీష్టానం ప్రకటించిన నేపథ్యంలో అదే పార్టీకి చెందిన జగ్గారెడ్డి షాక్‌కు గురయ్యారు.
అంతకు ముందు ఢిల్లీలో మీడియాతో జగ్గారెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికరమైన విషయంలు మీడియాతో పంచుకున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన తర్వాత నేను పొలిటికల్ బ్లాంక్ అయ్యానని, ప్రస్తుతం తాను *షాక్ లో ఉన్నాను, ఏం మాట్లాడాలో చెప్పలేని షాక్ లో ఉన్నా* అని తెలిపారు.
అభ్యర్థుల ఖరారు నేపథ్యంలో తానెందుకు షాక్ అయ్యానో.. ఆ విషయం భవిష్యత్ లో తెలుస్తుందని, సమయం వచ్చినప్పుడు మాట్లాడుతాని పేర్కొన్నారు. 2017 లో సంగారెడ్డిలో రాహుల్ సభ నిర్వహణను తానే చూశానన్నారు. ఆనాటి బాధలను రాహుల్ కు వివరించాలి అనుకున్నట్లు ఇప్పుడు ప్రస్తావించారు. అలాగే రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ అడిగానని, చరిత్రలో బలం ఉందిని, అందుకే ఆనాటి సభ విషయాలు చెప్పాలి అనుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. తాను వచ్చే సమయానికి రాహుల్, ఖర్గే, కేసి వేణుగోపాల్ లు ఢిల్లీలో లేరన్నారు. అయితే 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న జెట్టి కుసుమ కుమార్, కమ్మ సామాజిక వర్గ నాయకుడని, సెటిలర్స్ కు పొలిటికల్ బ్రిడ్జి అవసరం అని భావించానన్నారు. పీసీసీ చీఫ్, ఉత్తమ్, భట్టి లకు జెట్టి కుసుమ కుమార్ అంశం గురించి చెప్పానన్నారు. ఈ విషయం ముఖ్యమంత్రికి కూడా తెలుసన్నారు. తెలంగాణ నుంచి ఢిల్లీకి ఎవరు రాలేదని, తాను ఎవరికీ షేర్ చెయ్యలేక పోయానని తెలిపారు. అయితే తాను నేను హ్యాపీగా ఉన్నాను.. గెలుపు, ఓటముల ద్వారా నేర్చుకుంటూ ఉంటానన్నారు. అయితే తాను సానుభూతి రాజకీయాలు కోరుకోనని జగ్గారెడ్డి మీడియాకు తెలిపారు. ఇప్పుడు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఫుల్ వైరల్‌గా మారాయి. అలాగే అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.
* * *