Telangana KCR News | రాష్ట్ర అసెంబ్లీకీ కేసీఆర్
గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ప్రసంగానికి హాజరవుతారు
వెల్లడించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి
అసెంబ్లీకి కేసీఆర్ రాకపోవడమే మంచిది-తన అభిప్రాయం వెలిబుచ్చిన కేటీఆర్
Hyderabad : రాష్ట్రంలో ఈ నెల 12 నుంచి ప్రారంభం కాబోతున్న అసెంబ్లీ సమావేశాలకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. అయితే అసెంబ్లీలో బుధవారం గవర్నర్ ప్రసంగానికి హాజరవుతారని చెప్పారు. ఆ తర్వాత బడ్జెట్ ప్రసంగంలోనూ కేసీఆర్ పాల్గొంటారని సంచలన ప్రకటన చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్.. మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ నెల 12 నుంచి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని తెలిపారు. తర్వాత కొన్ని కార్యక్రమాలకు కూడా కేసీఆర్ వస్తారని తెలిపారు . కానీ కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడమే మంచిదని ఒక కొడుకుగా తన అభిప్రాయమని చెప్పారు. కేసీఆర్ స్థాయికి కాంగ్రెస్‌లో ఎవరూ సరిపోరని అన్నారు. వాళ్ల పిచ్చి మాటలు, పనికిమాలిన దూషణలు, కారుకూతలు వినడానికి కేసీఆర్ రావద్దనేది కొడుకుగా తన అభిప్రాయమని వివరించారు.
బీఆర్‌ఎస్ సభకు వరంగల్ అనువైన ప్రాంతమని కేటీఆర్ తెలిపారు. అన్ని రకాల రవాణా సదుపాయం ఉందని పేర్కొన్నారు. ప్లీనరీ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. దీనిపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేశారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున రెండు సభలు పెడితే ఇబ్బంది అని భావించామని తెలిపారు.
* * *