Thursday, March 13, 2025

QR Code on ssc exam papers | టెన్త్ క్లాస్ ప్ర‌శ్నాప‌త్రంపై `క్యూఆర్ కోడ్‌`

QR Code on ssc exam papers | టెన్త్ క్లాస్ ప్ర‌శ్నాప‌త్రంపై `క్యూఆర్ కోడ్‌`
టెన్త్‌క్లాస్ ప‌రీక్ష‌లో పేప‌ర్ లీకేజీకి కాకుండా నియంత్ర‌ణ‌
ప‌రీక్ష‌ల ఏర్పాట్ల‌కు క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్లు చేస్తున్న ఎస్ఎస్‌సీ బోర్డు
Hyderabad : రాష్ట్రంలో ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న టెన్త్ క్లాస్ ప‌రీక్ష‌ల‌కు క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్లు చేస్తున్నారు. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో సాంకేతిక‌ను జోడించారు. ప్ర‌శ్నాప‌త్రాలు లీక్ కాకుండా చ‌ర్య‌లు తీసుకున్నారు. అందుకోసం టెన్త్‌క్లాస్ ప‌రీక్ష ప్ర‌శ్నాప‌త్రాలు లీక్ కాకుండా హై టెక్నాల‌జీతో `క్యూఆర్ కోడ్` విధానాన్ని ప్ర‌వేశ పెడుతున్నారు. ఈ క్ర‌మంలో తొలిసారిగా టెన్త్‌క్లాస్ ప్ర‌శ్నాప‌త్రాల‌పై క్యూఆర్‌కోడ్‌ను ముంద్రించ‌నున్న‌ట్లు తెలిసింది. అయితే ప్ర‌శ్నాప‌త్రాల‌ను ఎవ‌రైన ఫోటోలు గాని, వీడియోలు కాని తీసి సోష‌ల్ మీడియాలో పోస్టు చేసినా.. జిరాక్స్ తీసినా నిందితులు దొరికిపోతారు. ఏ ప్ర‌శ్నాప‌త్రం ఎక్క‌డ నుంచి ఫోటో తీశారో, ఎక్క‌డ నుంచి పేప‌ర్ లీక్ అయిందో క్యూఆర్ కోడ్ విధానం వ‌ల్ల ప‌ట్టుకోవ‌డం అధికారులుకు సుల‌వుతుంది. అలాగే ఏ ప‌రీక్ష కేంద్రంలో, ఏ విద్యార్ధి నుంచో, ఏ ఇన్విజిలేట‌ర్ నుంచి పేప‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చిందో అన్న విష‌యం కూడా తెలిసిపోయే విధంగా క్యూఆర్ కోడ్ విధానాన్ని రూపొందించారు.
మ‌రో ప‌క్క ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌కు ప్ర‌భుత్వ ప‌రీక్ష‌ల విభాగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. విద్యార్థుల హాల్‌టిక్కెట్లు వెబ్‌సైట్‌లో పెట్టింది. హాల్‌టిక్కెట్ల డౌన్ లోడ్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. https://bse.telangana.gov.in అనే వెబ్‌సైట్ ద్వారా విద్యార్థులు త‌మ హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో టెన్త్ క్లాస్ ప‌రీక్ష‌ల‌కు 5,09,403 మంది ప‌రీక్ష‌ల‌కు విద్యార్థులు హాజ‌రు కానున్నారు. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2650 ప‌రీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప‌రీక్ష‌ల‌కు సంబంధించి మ‌రింత స‌మాచారం కోసం ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష నియంత్ర‌ణ అధికారి కార్యాల‌యంలో టోల్‌ఫ్రీ నంబ‌ర్ 040-23230942ను సంప్ర‌దించాల‌ని అధికారులు తెలిపారు.
  •  *  *

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles