Friday, March 14, 2025

Tamil nadu State | రుపీ గుర్తుకు త‌మిళ సర్కార్ గుడ్‌బై

Tamil nadu State | రుపీ గుర్తుకు త‌మిళ సర్కార్ గుడ్‌బై
త‌మిళ‌నాడు బ‌డ్జెట్‌లో సింబ‌ల్‌ను తొలిగించిన స‌ర్కారు
రుపి స్థానంలో `రూ` అర్థం వ‌చ్చే విధంగా అక్ష‌రం చేర్పు
వ్య‌తిరేకిస్తున్న బీజేపీ నాయ‌కులు
Hyderabad : కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన త్రిభాష సూత్రాన్ని గ‌త కొంత‌కాలంగా త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం వ్య‌తిరేకిస్తు వ‌స్తుంది. ఈక్ర‌మంలో తమిళనాట భాషా వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. ఆ రాష్ట్ర‌ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ 2025-26 రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ కోసం తయారుచేసిన లోగోలో అధికారిక రూపాయి చిహ్నాన్ని తొలగించి, ఆ స్థానంలో తమిళ పదం రూబాయిని చేర్చారు. జాతీయ విద్యా విధానాన్ని(ఎన్‌ఈపీ) వ్యతిరేకించే విషయంలో తగ్గేది లేదన్న విష‌యాన్ని కేంద్ర స‌ర్కారు మరోసారి చెప్ప‌క‌నే చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీలో ఈ నెల (మార్చి) 14న ప్రవేశపెట్టనున్న రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు సంబంధించిన టీజర్‌ను సీఎం ఎక్స్‌ వేదికగా షేర్‌ చేశారు. సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా తమిళనాడు సమగ్రాభివృద్ధిని ఆకాంక్షిస్తూ బడ్జెట్‌ని రూపొందించినట్టు స్టాలిన్‌ ట్వీట్ ద్వారా తెలిపారు.
డీఎంకే నేత కుమారుడే రూపాయి సింబల్‌ రూపకర్త..
ద్రవిడియన్‌ మోడల్‌, టీఎన్‌బడ్జెట్‌ 2025 హ్యాష్‌ట్యాగులతో విడుదల చేసిన బడ్జెట్‌ లోగోలో హిందీ అక్షరం ఆర్‌ స్ఫూర్తితో రూపొందిన అధికారిక రూపాయి చిహ్నం మాయమైంది. ఆ స్థానంలో తమిళ పదం రూబాయికి చిహ్నమైన రూ అనే తమిళ అక్షరం దర్శనమిచ్చింది. గత రెండు వార్షిక బడ్జెట్‌లలో మాత్రం అధికారిక రూపాయి చిహ్నమే లోగోలలో ఉండడం విశేషం. 2023-24 బడ్జెట్‌ లోగోలో కూడా అధికారిక రూపాయి చిహ్నమే ఉంది. దీన్ని ఐఐటీ-గువాహటి ప్రొఫెసర్‌ డిజైన్‌ చేశారు. అయితే ఆయన డీఎంకే నాయకుడు కుమారుడు కావడం గ‌మ‌నించాల్సిన విష‌యం.
జాతీయ చిహ్నాన్ని తిర‌స్క‌రించ‌డం చ‌రిత్ర‌లో ఇదే తొలి సారి..
కేంద్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో రూపుదిద్దుకున్న ఒక‌ జాతీయ కరెన్సీ చిహ్నాన్ని ఒక రాష్ట్రం తిరస్కరించడం చరిత్రలో ఇదే మొదటిసారి అవుతుంది. ఎన్‌ఈపీ ప్రతిపాదించిన త్రిభాషా సూత్రాన్ని తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం అత్యంత‌ ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, అధికారిక రూపాయి చిహ్నాన్ని రాష్ట్రం తిరస్కరించడంగా దీన్ని భావించరాదని డీఎంకే అధికార ప్రతినిధి ఏ శరవణన్ అన్నారు. తమిళ అక్షరం రూ ఉపయోగించడం ద్వారా తమిళ భాషను ప్రోత్సహించే ప్రయత్నంగా చూడాలని ఆయన వివ‌రించారు. కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని త‌మిళ ప్ర‌జ‌లు న‌వ్వుల పాలు చేస్తున్నార‌ని బీజేపీకి చెందిన నాయ‌కులు వ్య‌తిరేకిస్తున్నారు. అధికారిక రూపాయి చిహ్నాన్ని మార్చాలని డీఎంకే ప్రభుత్వం నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ మూర్ఖత్వానికి పరాకాష్టగా అన్నామలై అభివర్ణించారు. యావద్దేశం ముందు తమిళ ప్రజలను నవ్వులపాలు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. త‌మిళ స‌ర్కారుపై ఎన్‌డీఏ కూట‌మి వ్య‌తిరేకిస్తుంది.
* * *

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles