Telangana LRS | దొంగ దొరవుతాడా ? పాపాత్ముడు పుణ్యాత్ముడు అవుతాడా?
ఎల్ఆర్ఎస్‌పై గందరగోళం
Artical by : నారగోని ప్రవీణ్ కుమార్, ప్రెసిడెంట్
తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ (TRA)
ఎల్ఆర్ఎస్ లో పెద్ద మోసం దాగి ఉంది. ఓపెన్ స్పేస్ చార్జెస్ అని 14 శాతం ప్రజల వద్ద వసూలు చేస్తున్నారు. అంటే పార్కు లేదు కాబట్టి మేము పార్కు కొనిస్తామని చెప్పేసి ప్రభుత్వం LRS లో కొంత రుసుము వసూలు చేస్తుంది. కానీ లేని పార్కును ప్రభుత్వం కొనివ్వడం లేదు. ఇప్పటివరకు ఏ లే అవుట్ లో కూడా పార్కు కొనిచ్చినటువంటి దాఖలాలు లేవు. ఒకే లే అవుట్ లో, ఒకే మార్కెట్ విలువ ఉన్నా.. ఒకేసారి రిజిస్ట్రేషన్ అయి ఉన్నా కూడా.. ఒకే ఒక ప్లాట్ కు మరొక ప్లాట్ కు ఎల్ఆర్ఎస్ చార్జీలో తేడా కనిపిస్తుంది.
*ఓపెన్ స్పేస్ చార్జెస్ కట్టకండి..
గ్రామ పంచాయతీ ప్లాట్లు అక్రమం కావు. ఒకవేళ అక్రమం అయితే రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్ట్రేషన్ శాఖలో ఉన్నటువంటి అధికారులను మొత్తం అరెస్టు చేయాలి. అనుమతి ఇచ్చినటువంటి గ్రామపంచాయతీ అధికారులని మున్సిపల్ అధికారులను అరెస్టు చేయాలి. ప్రభుత్వ శాఖ నే రిజిస్ట్రేషన్ చేస్తుంది. ప్రభుత్వ శాఖలే అనుమతి ఇస్తున్నాయి. మరి అక్రమం అని కూడా ప్రభుత్వమే చెప్పుతుంది. అంటే ప్రభుత్వానికి డబ్బులు చెల్లిస్తే దొంగ దొరవుతాడా ? పాపాత్ముడు పుణ్యాత్ముడు అవుతాడా? నేరస్థుడు నిర్దోషి అవుతాడా? ఇక్కడ తప్పు ఎవరిది? నేరం ఎవరు చేశారు ? ప్లాట్లు కొనుక్కున్న ప్రజలదా తప్పు, లే అవుట్ చేసిన రియల్టర్లదా తప్పు నేరం ఎవరిది శిక్ష ఎవరికి. ప్రజలు ఎవరిని నమ్మి ప్లాట్లు కొనాలి. ఆన్ లైన్ లో పేమెంట్ చేస్తే రసీదు కూడా రావడం లేదు. ఎల్ఆర్ఎస్ స్కీమ్ మొత్తం అయోమయం గందరగోళంగా తయారైంది.
ఎల్ఆర్ఎస్ లో ఓపెన్ స్పేస్ చార్జెస్ కట్టక పోయిన కూడా మీకు LRS ప్రొసీడింగ్ ఇస్తారు. ఓపెన్ స్పేస్ చార్జెస్ ఇంటి నిర్మాణానికి పోయినప్పుడు చెల్లించవలసి ఉంటుంది. లే అవుట్ లో ఓపెన్ స్పేస్ తగినంత లేదని ఓపెన్ స్పేస్ చార్జెస్ మార్కెట్ విలువలో 14 శాతం ప్లాట్లు కొన్న వారి దగ్గర వసూలు చేయడం అత్యంత దుర్మార్గం. లే అవుట్ చేసిన వారి దగ్గర వాస్తవంగా వసూలు చేయాలి, ఓపెన్ స్పేస్ లేదు కాబట్టి మీకు ఓపెన్ స్పేస్ కొనిస్తామని చెప్పి ప్రభుత్వము చార్జెస్ వసూలు చేస్తున్నది. కానీ ఇప్పటి వరకు ఎక్కడా ఏ లేఔట్ లో ఒక్క ఓపెన్ స్పేస్ కూడా ప్రభుత్వము కొనివ్వలేదు. కొనివ్వడానికి కూడా చాలా లే అవుట్లలో స్థలం ఉండదు. ఓవరాల్‌గా చెప్పాలంటే ఇది ప్లాట్ల యజమానులను మోసం చేయడమే.
* * *