Artificial Intelligence | టెక్ జాబ్‌లలో ఏఐ కీలకం
ప్రస్తుతం 50 శాతం పనులు కోడింగ్‌తోనే
మరో ఆరు నెలల్లో 90 శాతానికి పెరుగనున్న కోడింగ్ పనులు
Hyderabad : సాంకేతిక రంగాలలో ఉద్యోగాలు పొందాలనుకున్న విద్యార్థులు అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) నైపుణ్యం సాధించాలని చాట్ జీపీటికి చెందిన మాత్రు సంస్థ `ఓపెన్ ఏఐ` చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ `సీఈవో` శామ్ అల్ట్‌మెన్ సూచించారు. ఇప్పటికే అనేక కంపెనీలలో కోడింగ్ వంటి పనులు కోసం ఏఐ ఉపయోగిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం చాలా కంపెనీలలో 50 శాతం కోడింగ్ పనులు ఏఐ నిర్వహిస్తోందని తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. టెక్నాలజీ పరమైన ఉద్యోగాలలో చేరానుకునే విద్యార్థులంతా ఏఐతో కలిసి పని చేయడం నేర్చుకోవాలని తెలిపారు. లేకుండా జాబ్ మార్కెట్‌లో నిలదొక్కుకోవడం కష్టతరమవుతుందని ఆయన హెచ్చరించారు. ఏఐలో నైపుణ్యం సాధించిన వారికి ధీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. మానవ కోడర్ల స్థానంలో ఏఐని ప్రవేశ పెట్టాలన్న ఆలోచన రోజు రోజుకు పెరిగిపోతుందన్నారు. దీనికి అనేక మంది పారిశ్రామిక వేత్తలు సైతం ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. మరో ఆరు నెలల్లో 90 శాతం కోడింగ్ పనులు ఏఐ చేయగలుగుతుందన్నారు. ఈ ఏడాది చివరి నాటికే కోడింగ్‌లో మానవులను ఏఐ పూర్తిగా అధిగమించగలదని కొన్ని కంపెనీలు సూచిస్తున్నాయి. అయితే ఈ విషయంలో విద్యార్థులు ముందు వరుసలో ఉండాల్సిన సమయం ఆసన్నమైందని, సీఈవో చెప్పకనే చెప్పారు.
* * *