Cm Revanth Reddy – NABARD | సీఎం రేవంత్ రెడ్డితో నాబార్డు చైర్మన్ భేటీ
ఆర్ఐడీఎఫ్ కింద తక్కువ వడ్డీకి రుణాలు అందించాలని నాబార్డు చైర్మన్ ను కోరిన సీఎం
మైక్రో ఇరిగేషన్ కు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి
Hyderabad : రాష్ట్రంలో కో-ఆపరేటివ్ సొసైటీలను బలోపేతం చేయాలని, కొత్తగా మరిన్ని కో-ఆపరేటివ్ సొసైటీలను అందుబాటులోకి తీసుకురావాలని నాబార్డు చైర్మన్ షాజీ కేవీ కు సిఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. స్వయం సహాయక సంఘాల మహిళా గ్రూపులకు ప్రత్యేక పథకాన్ని రూపొందించాలని కోరారు. ఐకేపీ, గోడౌన్స్, రైస్ మిల్లులను నాబార్డుకు అనుసంధానం చేసి రాష్ట్రంలో మిల్లింగ్ కెపాసిటీ పెంచేందుకు సహకరం అందించాలన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో మంజూరైన నాబార్డు స్కీమ్స్ నిధులు ఈ నెల 31 లోగా ఉపయోగించుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. నాబార్డు పరిధిలోని స్కీములన్నింటినీ వచ్చే ఆర్ధిక సంవత్సరంలో వీలైనంత ఎక్కువ ఉపయోగించుకోవాలన్నారు. స్వయం సహాయక మహిళా సంఘాలకు అందించే సోలార్ ప్లాంట్స్ నిర్వహణను నాబార్డుకు అనుసంధానం చేయాలని సూచించారు. కొత్త గ్రామపంచాయతీలకు రూరల్ కనెక్టివిటీ పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కొత్త జిల్లాల్లో కొన్ని డీసీసీబీలు ఏర్పాటు చేయాలని నాబార్డు చైర్మన్ రాష్ట్ర సీఎంకు ప్రతిపాదనలు చేశారు. ఈ సమావేశంలో నాబార్డు ప్రతినిధులతోపాటు తాండూరు ఎమ్మెల్యె మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
* * *