Saturday, March 15, 2025

|Telangana Group-3 Results Out | తెలంగాణ గ్రూప్‌ -3 ఫలితాలు విడుదల

|Telangana Group-3 Results Out | తెలంగాణ గ్రూప్‌ -3 ఫలితాలు విడుదల
టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఫ‌లితాలు
వెబ్‌సైట్ ద్వారా మార్కుల షీట్ డౌన్‌లోడ్‌
టీజీపీఎస్సీ అధికారులు వెల్ల‌డి
Hyderabad : తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్‌-3 ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. ఇప్ప‌టికే తెలంగాణ రాష్ట్రంలో వ‌రుస‌గా గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఫ‌లితాలు విడుద‌ల చేసిన తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TGPSC) శుక్ర‌వారం గ్రూప్‌-3 ఫ‌లితాలు విడుద‌ల చేసింది. గత సంవ‌త్స‌రం నవంబర్‌లో జరిగిన ఈ పరీక్షలు హాజ‌రైన‌ అభ్యర్థుల మార్కులతో పాటు జనరల్ ర్యాంకుల జాబితాను టీజీపీఎస్సీ మధ్యాహ్నం విడుద‌ల చేసింది. అలాగే, గ్రూప్‌-3 పరీక్ష తుది కీ, మాస్టర్‌ క్వశ్చన్‌ పేపర్లతో పాటు ఓఎంఆర్‌ షీట్లను డౌన్‌లోడ్‌ కోసం అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. విడుద‌లైన నోటిఫికేష‌న్ ప్ర‌కారం రాష్ట్రంలో 1,365 గ్రూప్‌-3 ఉద్యోగాలకు 5,36,400 మంది అభ్య‌ర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ప‌రీక్ష‌ల‌కు గతేడాది నవంబర్‌ 17, 18 తేదీల్లో మూడు పేపర్లుగా జరిగిన ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 50.24శాతం మంది మాత్రమే హాజరయ్యారు. ఇటీవల గ్రూప్‌- 1, గ్రూప్‌ -2 ఫలితాలను టీజీపీఎస్సీ తాజాగా గ్రూప్‌-3 ఫలితాలను విడుదల చేసింది. అలాగే, హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్ (HWO) పోస్టులకు నిర్వహించిన పరీక్షల తుది ఫలితాలను ఈ నెల‌ 17న, ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ ఉద్యోగ పరీక్షల తుది ఫలితాలు ఈ నెల‌ 19న ప్రకటించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ టీజీపీఎస్సీ అధికారులు విడుద‌ల చేసిన‌ట్లు స‌మాచారం.
* * *

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles