Friday, March 14, 2025

BRS Working President KTR | ప‌ది విద్యార్థుల‌కు పెన్నులు, రైటింగ్ ప్యాడ్‌లు పంపిణీ

BRS Working President KTR | ప‌ది విద్యార్థుల‌కు పెన్నులు, రైటింగ్ ప్యాడ్‌లు పంపిణీ
సిరిసిల్లా విద్యార్థుల‌కు చిరు కానుక‌ అందిస్తున్న‌ కేటీఆర్‌

Hyderabad : ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌కు హాజ‌రుకాబోతున్న విద్యార్థిని, విద్యార్థుల‌కు బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కే తార‌క రామారావు ( కేటీఆర్‌) చిన్న బ‌హుమ‌తులు అంద జేస్తున్నారు. ప‌రీక్ష‌ల‌కు కావాల్సిన రైటింగ్ ప్యాడ్‌, పెన్సులు కానుక‌గా ఇవ్వ‌బోతున్నారు. సిరిసిల్లా నియోజ‌క వ‌ర్గంలో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చ‌దువుతున్న ప‌ది విద్యార్థుల‌కు ప్యాడ్‌, పెన్నులు పంపిణీ చేస్తున్నారు. `గిఫ్ట్ ఏ స్మైల్ పేరు` తో గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా విద్యార్థులకు ప‌రీక్ష‌ల‌కు కావాల్సిన బ‌హుమ‌తులు అందజేస్తున్నారు. అయితే మంగళవారం నియోజక వర్గంలోని సిరిసిల్ల పట్టణం, తంగళ్లపల్లి, ఎల్లారెడ్డి పేట, వీర్ణపల్లి, గంభిరావుపేట, మూస్తాబాద్‌లోని ప్రభుత్వ జడ్‌పీహెచ్‌ఎస్‌లలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు అంద‌జేయనున్నారు.
దీనికోసం ఆ పార్టీ నేతలు, మాజీ ప్రజా ప్రతినిధులు తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేర‌కు పదో తరగతి విద్యార్థులు, ఉపాద్యాయులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ప‌రీక్ష‌ల‌కు హాజ‌రుకానున్న విద్యార్థులకు ఈ సంద‌ర్భంగా కేటీఆర్ శుభాకాంక్ష‌లు తెలుప‌నున్నారు.
* * *

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles