Friday, July 4, 2025

Chaduvukovaali | సామాజిక చైతన్య చిత్రాలు రావాలి

Chaduvukovaali | సామాజిక చైతన్య చిత్రాలు రావాలి
రాష్ట్ర ప్ర‌ణాళి సంఘం ఉపాధ్య‌క్షుడు చిన్నారెడ్డి పిలుపు
గద్దర్ సినిమా అవార్డు గ్రహీత వెంకటేశ్వరరావుకు అభినందన సభలో పాల్గొన్న చిన్నారెడ్డి..
Hyderabad : స‌మాజంలో పేరుకు పోతున్న రుగ్మ‌త‌ల‌ను అరిక‌ట్ట‌డం కోసం, చ‌దువుకోవాలి అనే సినిమా మాదిరిగానే.. మ‌ద్య‌పానం, డ్ర‌గ్స్‌ నిషేదం అన్న అంశంపై సినిమాలు తీయాల‌ని రాష్ట్ర ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్య‌క్షుడు చిన్నారెడ్డి పిలుపునిచ్చారు. సమాజంలో ముఖ్యంగా విద్యారంగ ప్రగతికి కృషిచేసే ‘చదువుకోవాలి’ సినిమాను నిర్మించి, గద్దర్ అవార్డు పొంది అందరికీ ఆదర్శంగా దర్శక, నిర్మాత, రచయిత, సీనియర్ జర్నలిస్ట్ ఎం.వెంకటేశ్వరరావు నిలిచారని ఈ సంద‌ర్భంగా ఆయ‌న కొనియాడారు. హరిహర ఫౌండేషన్, తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో గద్దర్ అవార్డు గ్రహీత, చదువుకోవాలి చిత్ర దర్శక, నిర్మాత ఎం.వెంకటేశ్వరరావు సోమవారం రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన ఆత్మీయ అభినందన సభలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో మంచి చిత్రాలు రావాలని, సామాజిక అంశాలపై చిత్రాలు తీయాలని పేర్కొన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాలలో డ్రగ్స్, మద్యపాన వినియోగం పెరిగి పోయిందని, వీటి నివారణకు సినిమాలు రూపొందించాలని కోరారు. వనపర్తి ప్రాంతానికి చెందిన వెంకటేశ్వరరావు తెలంగాణా నుంచి విద్యకోసం ఒక మంచి చిత్రం రూపొందించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు అందుకోవడం విశేషమన్నారు.
ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు మాట్లాడుతూ ‘చదువుకోవాలి’ లాంటి ఉత్తమ చిత్రానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గద్దర్ అవార్డును ప్రత్యేకంగా ఇచ్చి ప్రోత్సహించారని విద్యకోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సమాజం పట్ల భధ్రతగా వ్యవహరిస్తూ విద్య ద్వారానే ప్రగతి సాధ్యమని, విద్యా ప్రాధాన్యతను సినిమా ద్వారా తెలియజెప్పి ప్రజలను చైతన్యవంతం చేయడం వెంకటేశ్వరరావు చేసిన మంచిపని అని అన్నారు. అందుకే ఆయనను గద్దర్ అవార్డుతో ప్రభుత్వం సత్కరించిదన్నారు. రాష్ట్ర‌ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాసగౌడ్ మాట్లాడుతూ .. రాష్ట్రంలోని ప్రతీ గురుకుల పాఠశాలలో ఈ చిత్రం ప్రదర్శించేలా ఉత్తర్వులు జారీ చేయాలని ముఖ్యమంత్రిని కోరనున్నట్లు తెలిపారు. పిసిసి రాష్ట్ర‌ స్థాయి నాయకులు రమ్యారావు మాట్లాడుతూ అందరికీ ఆదర్శప్రాయమైన చిత్రాలు నిర్మించిన వెంకటేశ్వరరావుకు రాష్ట్ర‌ ప్రభుత్వం మరింత ఆర్థిక సాయం అందించనున్నారు. తద్వారా ఆయన మరిన్ని చిత్రాలు నిర్మిస్తారన్నారు. ఒమేగా విద్యా సంస్థల అధిపతి ఎన్.నాగమోహనరెడ్డి మాట్లాడుతూ ‘చదువుకోవాలి’ చిత్రాన్ని ప్రతీ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రదర్శించేలా చూస్తామన్నారు. ఆయన ఈ చిత్రానికి 50 వేల రూపాయల సహాయాన్ని అందించారు. జెఎన్టీయూ మాజీ వీసీ డిఎన్ రెడ్డి, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేష్ ఉత్తమ చిత్రం తీసిన వెంకటేశ్వరరావును అభినందించారు.
సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ మాట్లాడుతూ.. విద్య పై వచ్చిన చదువుకోవాలి ఉత్తమ చిత్రమని ఆయన పేర్కొన్నారు. సీనియర్ జర్నలిస్టుగా పనిచేస్తూనే ఒక ఉత్తమ చిత్రాన్ని రూపొందించి పలు అవార్డులను కైవసం చేసుకోవడం వెంకటేశ్వరరావుకి దక్కిందన్నారు. రాష్ట్ర సాంకేతిక విద్య శిక్షణా మండలి కార్యదర్శి పుల్లయ్య, తెలంగాణ సాహిత్య అకాడమి కార్యదర్శి డా.ఎన్.బాలాచారి, తెలుగు అకాడమి మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ యాదగిరి, సావమి రామానంద తీర్థ సంస్థ చైర్మన్ ప్రొఫెసర్ కిశోర్ రెడ్డి, సచివాలయ అధికారుల సంఘం అధ్యక్షులు డాక్టర్ సురేష్, గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులు నాగరాజు, హరిహర ఫౌండేషన్ అధ్యక్షులు మారగాని శ్రీనివాసరావు, రాష్ట్ర‌ ఫార్మసీ కళాశాలల సంఘ గౌరవ అధ్యక్షులు డాక్టర్ కె.రామదాస్ తదితరులు పాల్గొన్నారు. చిత్ర దర్శకులు వెంకటేశ్వరావుతోపాటు నటి దేశరాజు లలిత, సహ నిర్మాత పవన్ సాయి, కో డైరెక్టర్ సాయిశ్వేతను సత్కరించారు.
* * *

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles