Cm Revanth Reddy | రాష్ట్ర ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం
ప్రజలకు శ్రీరాముని కరుణా కటాక్షాలు ఉండాలని ఆకాంక్ష
Hyderabad : శ్రీ రామ నవమి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తన శుభాకాంక్షలు తెలియజేశారు. సకల జగతికి ఆనందకరమైన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దివ్య కల్యాణం సందర్భంగా ఆ భద్రాద్రీశుడి ఆశీస్సులు, కరుణాకటాక్షాలు ప్రజలందరిపైనా ఉండాలని ప్రార్థించారు.
*భద్రాద్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో ఆదివారం నిర్వహిస్తున్న శ్రీ సీతారామస్వామి తిరుకల్యాణ మహోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరవుతున్నారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. కల్యాణం అనంతరం బూర్గంపాడు మండలం సారపాకలో సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేయనున్నారు.
* * *