Monday, April 28, 2025

Jammu and Kashmir | కాశ్మీర్ లో చిక్కుకున్న తెలంగాణ పర్యాటకుల కోసం‌ హెల్ప్ లైన్

Jammu and Kashmir | కాశ్మీర్ లో చిక్కుకున్న తెలంగాణ పర్యాటకుల కోసం‌ హెల్ప్ లైన్
స్వ‌స్థ‌లాల‌కు ర‌ప్పించేందుకు చ‌ర్య‌లు: మంత్రి జూప‌ల్లి కృష్ణారావు
Hyderabad : దేశంలోని ప‌ర్యాట‌క ప్రాంత‌మైన క‌శ్మీర్ లో చిక్కుకున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప‌ర్యాట‌కుల‌ను సుర‌క్షితంగా స్వ‌స్థ‌లాల‌కు ర‌ప్పించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం అన్ని చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని రాష్ట్ర ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు గురువారం తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున ప‌ర్యాట‌కుల‌కు త‌గిన సహాయం అందిస్తామ‌ని ఆయ‌న అన్నారు. ఈ ఘటనపై తెలంగాణ ప‌ర్యాట‌క శాఖ అధికారులు, ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులతో పాటు కేంద్ర ఏజెన్సీలతో సమన్వయంతో పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని చెప్పారు. ఇటీవల జమ్ము, కాశ్మీర్ లోప్రయాణించిన పర్యాటకుల వివరాలు వెంటనే అందించాల‌ని తెలంగాణలోని అన్ని టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లను మంత్రి కోరారు. తెలంగాణ పర్యాటకుల స్థితిగతులను పర్యవేక్షించేందుకు, అవసరమైన సమయంలో ప్రభుత్వ సహాయాన్ని అందించేందుకు ఉపయోగపడుతుందని అన్నారు.
తెలంగాణ ప‌ర్యాట‌క శాఖ ఆధ్వ‌ర్యంలో హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేశామ‌ని, కాశ్మీర్ లో చిక్కుకున్న తెలంగాణ ప‌ర్యాట‌కుల స‌హాయం కోసం నిరంతరం ఫోన్ ద్వారా సేవలు అందించ‌డం కోసం ఈ హెల్ప్ లైన్ నెంబర్ అందుబాటులో ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. పర్యాటకుల బంధువులు లేదా స్నేహితులు కూడా తమ సమాచారం అందించేందుకు, లేదా సహాయం కోసం కింది నంబర్లకు కాల్ చేయాలని కోరారు. హెల్ప్ లైన్ నంబ‌ర్లు- 9440816071, 9010659333, 040 23450368, Tourism complaints number: 7032395333, Toll free: 180042546464.
* * *

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles