Mlc Election Notification | ప్రారంభమైన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్యీ ఎన్నికల నామినేషన్లు
ఈ నెల 10 వరకు నామినేషన్లకు గడువు
ఈ నెల 20న పోలింగ్
నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీఐ
Hyderabad : రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం విడుదలైంది. ఈ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడానికి ఈ నెల 10 వరకు గడువు విధించారు. ప్రతి రోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నామినేషన్లు అసెంబ్లీ భవనంలో స్వీకరించే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే సెలవు రోజులలో మాత్రం నామినేషన్ల స్వీకరణ ఉండదన్నారు. అయితే నామినేషన్‌కు సంబంధించి పత్రాలు అసెంబ్లీ లోనే పొందవచ్చని అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఎన్నికల రిటర్నింగ్ అధికారిక సీహెచ్ ఉపేందర్‌రెడ్డి సోమవారం తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 11 ఉదయం 11 గంటలకు నామినేషన్ల పరిశీలన ఉంటుందని, ఈ నెల 13 మధ్యాహ్నం 3 గంటల లోపు నామినేషన్లకు ఉపసంహారణకు గడువు ఉంటుందని నోటిఫికేషన్‌లో తెలిపారు. అయితే రాష్ట్రంలో 5 మంది ఎమ్మెల్సీల గడువు ఈ నెల 29తో ముగియనుండడంతో ఎన్నికల కమిషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం మహముద్ అలీ, సత్యవతిరాథోడ్, శేరి శుభాష్‌రెడ్డి, మల్లేషం ఎగ్గే, మిర్జా రియజుల్ హసన్ ఎఫండీల గడువు ముగుస్తుంది.
* * *
good story