Friday, March 14, 2025

Amarnath yatra schedule | జూలై 3 నుంచి అమ‌ర‌నాథ్ యాత్ర

Amarnath yatra schedule | జూలై 3 నుంచి అమ‌ర‌నాథ్ యాత్ర
ఆగ‌స్టు 9న ముగియ‌నున్న యాత్ర‌
అమ‌ర్‌నాథ్ పుణ్య‌క్షేత్ర బోర్డు స‌మావేశంలో నిర్ణ‌యం
షెడ్యూల్ విడుద‌ల‌
Hyderabad : శ్రీ అమర్‌నాథ్ వార్షిక యాత్ర ఈ ఏడాది జూలై 3, 2025న ప్రారంభమై ఆగస్టు 9న రక్షా బంధన్ సందర్భంగా ముగుస్తుంది. ఈ యాత్ర అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్ మార్గం, గండేర్‌బాల్ జిల్లాలోని బాల్తాల్ మార్గం రెండింటి ద్వారా నిర్వహించబడుతుంది. యాత్ర‌కు సంబంధించిన ఏర్పాట్ల‌పై సమీక్షించడానికి, శ్రీ అమర్‌నాథ్ జీ పుణ్యక్షేత్ర బోర్డు (SASB) చైర్మన్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మంగళవారం రాజ్ భవన్‌లో జరిగిన 48వ బోర్డు సమావేశంలో నిర్ణ‌యం తీసుకున్నారు. వ‌చ్చే యాత్రికులకు సౌకర్యాలను మెరుగుపరచడం, యాత్ర సజావుగా సాగేలా చూడటంపై ఈ సమావేశంలో ప్ర‌ధానంగా దృష్టి సారించారు. ఈ సమావేశంలో స్వామి అవధేషానంద్ గిరి జీ మహారాజ్, డి సి రైనా, కైలాష్ మెహ్రా సాధు, కె ఎన్ రాయ్, పితాంబర్ లాల్ గుప్తా, డాక్టర్ శైలేష్ రైనా, ప్రొఫెసర్ విశ్వమూర్తి శాస్త్రి వంటి బోర్డు సభ్యులు, కేంద్ర పాలిత ప్రాంత పరిపాలన, పుణ్యక్షేత్ర బోర్డు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
యాత్రికుల సంఖ్య పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని, జమ్మూ, శ్రీనగర్ ఇతర ప్రదేశాలలో బస చేయ‌డానికి కావాల్సిన మెరుగైన సౌకర్యాలను క‌ల్పించాల‌ని బోర్డు ప్రతిపాదించింది.
నౌగామ్, కాట్రా రైల్వే స్టేషన్లతో సహా పలు ప్రదేశాలలో (e-KYC, RFID) కార్డుల జారీ, ఆన్-స్పాట్ రిజిస్ట్రేషన్ కోసం యాత్రి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అదనంగా, శ్రీనగర్‌లోని బాల్టాల్, పహల్గామ్, నున్వాన్ తో పాటు పంథా చౌక్‌లలో కూడా సౌకర్యాలు మెరుగు చేసే విధంగా నిర్ణ‌యం తీసుకున్నారు.
* * *

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles