AP SSC Exam Hall Tickets | వెబ్‌సైట్‌లో పదో తరగతి పరీక్షల హాల్‌టిక్కెట్లు
విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకోవాలని ఏపీ మంత్రి లోకేష్ వెల్లడి
Hyderabad : ఏపీ రాష్ట్రంలో ఈ నెలలో నిర్వహించే పదో తరగతి విద్యార్థులు హాల్ టిక్కెట్లపై ఆ ప్రభుత్వం నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. పది హాల్‌టిక్కెట్లు విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్ (bse.ap.gov.in)ను సందర్శించి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. హాల్ టిక్కెట్‌లు సోమవారం మధ్యాహ్నం 2:00 గంటల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఏపీ సర్కారు ప్రకటించింది. హాల్‌టిక్కెట్లు అధికారిక వెబ్‌సైట్ (bse.ap.gov.in)లో అందుబాటులో పెట్టింది. తమ పాఠశాల ద్వారా లాగిన్ చేసుకోవచ్చని పేర్కొన్నది. మన మిత్ర, ఏపీ ప్రభుత్వ వాట్సాప్ సేవల ద్వారా (9552300009), విద్యా సేవలను పొందవచ్చని పేర్కొంది. దరఖాస్తు సంఖ్య, విద్యార్థుల ఐడీ, పుట్టిన తేదీ వంటి వివరాలు నమోదు చేసి హాల్ టిక్కెట్‌లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఏపీ ప్రభుత్వం తెలిపింది.
ఎస్సెస్సీ పరీక్షల హల్ టికెట్లు వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా ఈ మధ్యాహ్నం 2 గంటల నుంచి పొందవచ్చని మంత్రి నారా లోకేష్ తెలిపారు. bse.ap.gov.in వెబ్‌సైట్‌లో స్కూల్ లాగిన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. అలాగే వాట్సాప్‌లోని మనమిత్ర ద్వారా (9552300009)ఎడ్యూకేషనల్ సర్వీస్‌ను ఎంపిక చేసుకుని, హాల్ టికెట్లు పొందవచ్చని స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్‌లో తెలిపారు.