Thursday, March 13, 2025

Artificial Intelligence | ఏఐతో మంచి భ‌వ‌ష్య‌త్తు

Artificial Intelligence | ఏఐతో మంచి భ‌వ‌ష్య‌త్తు
కృత్రిమ మేధస్సు తో ఎంతో భ‌విష్య‌త్తు..
ఎన్ఐటీ డైరెక్ట‌ర్ ప్రొఫెస‌ర్ ర‌మ‌ణ‌రావుతో వికాసం ప్ర‌త్యేక ఇంట ర్వ్యూ..

Hyderabad : ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా ఆర్టిఫిష‌య‌ల్‌ ఇంటెలిజెన్స్(ఏఐ) హ‌వా కొన‌సాగుతుంది. ఈ రంగంలోనే ఉద్యోగాలు పుష్క‌లంగా ఉన్నాయి. యువ‌త ఐఏ వైపు పరుగులు పెడుతున్నారు. ప్ర‌తి రంగంలో కూడా ఏఐ ప్రాధాన్య‌త పెరుగ‌డం ఇందుకు నిద‌ర్శ‌నంగా మారింది. కొన‌సాగింపుగా అంత‌ర్జాతీయ స్థాయిలో అన్ని యూనివ‌ర్సిటీల‌లో ఏఐ కోర్సును ప్ర‌వేశ పెట్ట‌డం ప్ర‌ముఖంగా భావిస్తున్నారు. కంప్యూట‌ర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగంలో అనుబంధంగా ఏఐ కోర్సు కొన‌సాగుతుంది. ఈ కోర్సును ప్ర‌వేశ పెట్టే క్ర‌మంలో అఖిల భార‌త సాంకేతిక విద్యా మండ‌లి (ఏఐసిటీఈ) కూడా అనుమ‌తులు మంజూరు చేస్తుంది. దీంతో దేశ వ్యాప్తంగా అన్ని కాలేజీల‌లో ఈ కోర్సును ప్ర‌వేశ పెట్టారు. కొన‌సాగింపుగా తెలంగాణ రాష్ట్రంలో జేఎన్‌టీయూ, ఉస్మానియా యూనివ‌ర్సిటీ వంటి ప్రాధాన్య‌త ఉన్న పలు యూనివ‌ర్సిటీల‌లో కూడా ఈ కోర్సును ప్ర‌వేశ పెట్టారు. అలాగే యూనివ‌ర్సిటీల‌కు అనుబంధంగా కొన‌సాగుతున్న కాలేజీల‌తో పాటు ప్ర‌భుత్వ ఇంజినీరింగ్ కాలేజీల‌తో పాటు ప్రైవేటు యూనివ‌ర్సిటీలు, డీమ్డ్ వ‌ర్సిటీలు, ప‌లు జాతీయ విద్యా సంస్థ‌ల‌లో కూడా ఈ కోర్సును ప్ర‌వేశ పెట్టారు. అయితే ఈ కోర్సుకు ఉన్న ప్రాధాన్య‌త ఏమిటీ? ఈ కోర్సు పూర్తి చేయ‌డం వ‌ల్ల యువ‌త‌కు ఎలాంటి ఉద్యోగాలు వ‌స్తాయి? భ‌విష్య‌త్తు ఏమిటీ అనే అంశాల‌పై ఎన్ఐటీ రాయ‌చూర్ డైరెక్ట‌ర్ ప్రొఫెస‌ర్ ఎన్‌వి ర‌మ‌ణ‌రావుతో వికాసం ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ చేసింది. ఆ వివ‌రాలు ఇలా ఉన్నాయి..
ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) లేదా కృత్రిమ మేధస్సు మన దైనందిన జీవితంలో విపరీతంగా పెరుగుతోంది. దాని ప్రాముఖ్యత:

*సమయం – శక్తి ఆదా
– ఏఐ ఆధారిత యాప్స్, స్మార్ట్ హోమ్ డివైసెస్ (ఉదా: అలెక్సా, గూగుల్ అసిస్టెంట్) ద్వారా మన పనులు వేగంగా, మ‌రింత‌ సమర్థవంతంగా పూర్తి అవుతున్నాయి. ఉదాహరణకు, కాలెండర్ రిమైండర్స్, ఆన్‌లైన్ ఆర్డర్లు, గృహ పనుల నిర్వహణ వంటివి.

*వ్యక్తిగతీకరించిన సేవలు
– ఏఐ ఆధారిత సిస్టమ్స్ ప్రతి వ్యక్తి కి సంబంధించిన‌ అభిరుచులు, అలవాట్ల ఆధారంగా సేవలను కస్టమైజ్ చేస్తాయి. ఈ విధంగా మనకు ఆన్‌లైన్ షాపింగ్, ఎంటర్టైన్మెంట్ స్టడీ సలహాలు చాలా సులభంగా లభిస్తున్నాయి.

*ఆరోగ్యం – ఫిట్‌నెస్

– ఫిట్‌నెస్ ట్రాకర్స్, ఆరోగ్య యాప్స్ ద్వారా మన శరీర పరిస్థితిని నిరంతరం ట్రాక్ చేయడం, డాక్టర్లు ఏఐ సాయంతో సత్వర నిర్ధారణలు చేయడం వంటి విధానాలు ఆరోగ్య పరిరక్షణలో సహాయపడుతున్నాయి.

*వాహనాలు – ట్రాన్స్‌పోర్టేషన్

– స్మార్ట్ కార్స్, గూగుల్ మ్యాప్స్ వంటి సాంకేతికత ఏఐ పై ఆధారపడి, సురక్షితంగా మరియు సమయానుసారంగా గమ్యస్థానానికి చేరడానికి సహాయపడతాయి.

*వాణిజ్య రంగం:

-బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో ఏఐ అనేక ఆటోమేటెడ్ సేవలను అందిస్తుంది. ఫ్రాడ్ డిటెక్షన్, అకౌంట్ మేనేజ్‌మెంట్ వంటివి కూడా ఏఐ ద్వారా నిర్వహించబడుతున్నాయి.

ఈ విధంగా ఏఐ అనేక రంగాలలో ఉపయోగపడుతూ, మన జీవితాలను సులభతరం చేస్తోంది ఏఐ.

తెలుగు ప్రాంతాల్లో, ముఖ్యంగా తెలంగాణ, ఏపీ లో ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్సీ (AI) నిపుణులకు మంచి ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. వారికి భ‌వ‌ష్య‌త్తు కూడా చాలా బాగా ఉండ‌బోతుంది. ప్ర‌తి రంగంలో యువ‌త ఉద్యోగాలు ల‌భించ‌డం శుభ‌శూచ‌కం. అందుకు సంబంధించిన కొంత స‌మాచారం ఈ విధంగా ఉంది.

1. సాఫ్ట్‌వేర్ కంపెనీలు – స్టార్టప్స్:

హైదరాబాదుతో సహా ముఖ్యమైన టెక్ నగరాల్లో అనేక కంపెనీలు AI సంబంధిత రోల్స్‌ని అందిస్తున్నాయి. కొంత మంది ప్రముఖ కంపెనీలు వివ‌రాలు..

– ఇన్ఫోసిస్

– విప్రో

– TCS

– కాగ్నిజెంట్

– టెక్ మహీంద్రా

– మైక్రోసాఫ్ట్ ఇండియా

– గూగుల్ ఇండియా

– అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS)

2. AI స్టార్టప్స్:

డేటా సైన్స్, రోబోటిక్స్ మిషిన్ లెర్నింగ్ వంటి రంగాలలో ప్రత్యేకత కలిగిన అనేక AI స్టార్టప్ లు AI నిపుణులను ఆహ్వానిస్తున్నాయి. కొంత మంది ప్రముఖ AI స్టార్టప్స్ వివ‌రాలు..

– AIndra Systems

– SigTuple

– Flytta

– Tuplejump

– CognitiveScale

3. అనుసంధాన సంస్థలు:

AI పరిశోధన, అభివృద్ధి సంస్థలు AI పరిశోధనలో ఉద్యోగ అవకాశాలను అందిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైన పరిశోధన సంస్థలు:

– ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూ ట్‌ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT), హైదరాబాద్

– ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB), హైదరాబాద్

– ఇండియన్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ (IIT), హైదరాబాద్

4. ప్రభుత్వ ప్రాజెక్టులు:

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు AI, టెక్నాలజీ-ఆధారిత ప్రాజెక్టులలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. AI నిపుణులు స్మార్ట్ సిటి ప్రాజెక్టులు, AI ఆధారిత పాలన పరిష్కారాలు, డేటా సైన్స్ కేంద్రాల్లో ఉద్యోగ అవకాశాలను పొందవచ్చు.

5. AI కన్సల్టెన్సీ సంస్థ‌లు :

పరిశ్రమలకు AI టెక్నాలజీలను అమలు చేయడంలో సహాయం చేసే కన్సల్టెన్సీ ఫిర్ములు AI నిపుణులను అవసరం పడతాయి. కొంత మంది ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ‌లు:

– డెలాయిట్

– PwC

– KPMG

– ఎర్నెస్ట్ అండ్‌ యంగ్

6. ఎడిటెక్ – AI విద్య :

ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌ల వృద్ధితో, AI నిపుణులు విద్యా సాంకేతికత (EdTech) కంపెనీలలో లేదా AI మరియు మెషిన్ లెర్నింగ్ డొమైన్‌లలో ఉపాధ్యాయులుగా, శిక్షకులుగా పనిచేయవచ్చు.

*మీరు Naukri, -LinkedIn, లేదా Indeed వంటి జాబ్ పోర్టల్‌లలో AI-సంబంధిత ఉద్యోగాల కోసం సెర్చ్‌ చేసుకోవ‌చ్చు.

*ఫ్రొఫెస‌ర్ ర‌మ‌ణ‌రావు గురించి..
ప్రొఫెసర్ ర‌మ‌ణ‌రావు ఎన్నో ఆద‌ర్శ భావాలు క‌లిగిన వ్య‌క్తి, స‌బ్జెక్టు నిపుణులు, అన్ని రంగాల‌పై సంపూర్ణ అవ‌గాహ‌న క‌లిగి ఉన్న ప్రొఫెస‌ర్‌, సివిల్ ఇంజినీరింగ్ విభాగంతో పాటు స‌మ‌కాలీన అంశాల ప‌ట్ల ఆయ‌న సంపూర్ణ అవ‌గాహ‌న త‌న సొంతం చేసుకున్నారు. ఉస్మానియా యూనివ‌ర్సిటీలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఐఐటీ ఢిల్లీ నుంచి ఐఐటీ పొందారు. యూకేకు చెందిన యూనివ‌ర్సిటీ నుంచి పీహెచ్‌డి పొందారు. ప్ర‌స్తుతం ఎన్ఐటీ రాయ్‌పూర్ డైరెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు కొన‌సాగిస్తున్నారు. ఆయ‌న గ‌తంలో ఎన్ఐటీ వ‌రంగ‌ల్ డైరెక్ట‌ర్‌గా ఐదేళ్లు ప‌ని చేసి శ‌భాష్ అనిపించుకున్నారు. జేఎన్‌టీయూ హైద‌రాబాద్‌కు సుధీర్ఘ‌కాలం రిజిస్ట్రార్‌గా ప‌ని చేశారు. జేఎన్‌టీయూ కాలేజీ ప్రిన్సిప‌ల్‌గా విధులు నిర్వ‌హించారు. అలాగే ఎంసెట్ క‌న్వీన‌ర్‌గా కొన‌సాగుతూ ఎంసెట్‌లో అనేక సంస్క‌ర‌ణ‌లు తెచ్చిన ఘ‌న‌త ఆయ‌న‌కు ద‌క్కుతుంది. అలాగే ఆయ‌న సివిల్ ఇంజినీరింగ్‌లో ప్రొఫెస‌ర్ కావ‌డంతో ఎన్నో నిర్మాణ రంగం సంస్థ‌ల‌కు ప్ర‌ధాన క‌న్స‌ల్టెంట్‌గా, ప్ర‌ధాన స‌ల‌హాదారునిగా విధులు నిర్వ‌హిస్తున్నారు. ఇలా చెప్పుకుంటే.. అనేక జీవితంలో ఎన్నో సేవ‌లు అందించారు. అలాగే ఆయ‌న ఎంతో మందికి ఆద‌ర్శంగా, మార్గ‌ద‌ర్శ‌కులుగా నిలుస్తున్నారు.
* * *

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles