Thursday, March 13, 2025

Kcr Birth Day | ఘనంగా అధినేత కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు

Kcr Birth Day | ఘనంగా అధినేత కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు
వెల్లువెత్తిన అభిమానుల జన్మదిన శుభాకాంక్షలు
రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన అభిమానుల తాకిడితో ఎరవెల్లి నివాసంలో నెలకొన్న సందడి
జై కేసీఆర్.. జై తెలంగాణ.. నినాదాలతో మార్మోగిన‌ నివాస ప్రాంగణం
దాదాపు నాలుగు గంటలకు పైగా నిలబడి శుభాకాంక్షలు స్వీకరిస్తూ ఫోటోలు దిగిన అధినేత కేసీఆర్‌

Hyderabad : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్ రావు పుట్టినరోజు వేడుకలు ఎర్రవెల్లి నివాసంలో ఘనంగా జరిగాయి. అధినేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి అభిమానులు పార్టీ కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయకులు, అభిమానుల కోలాహలంతో ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో సందడి నెలకొంది. ఎర్రవెల్లి పరిసరాలు వందలాది వాహనాలతో నిండిపోయాయి. కెసిఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతున్న స‌మ‌యంలో అభిమానులు, కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో, ఉద్వేగంతో నినాదాలు చేశారు. కేసీఆర్ జిందాబాద్.. తెలంగాణ జిందాబాద్… కెసిఆర్ రావాలి అంటూ సీఎం కేసీఆర్ నినాదాలతో నివాస ప్రాంగణ పరిసరాలు దద్దరిల్లాయి. తనను చూసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన శ్రేణులను పేరుపేరునా పలకరిస్తూ నాలుగు గంటల పాటు నిరంతరాయంగా నిలబడి వారితో ఫోటోలు దిగారు. త‌మ‌ అభిమాన నాయ‌కుడిని, తెలంగాణ ప్ర‌గ‌తి ప్రధాతను కలిసినప్పుడు అభినందనలు తెలుపుతూ పూల బొకేలను శాలువాలను ఫోటోలను పుస్తకాలను అందించారు. కొంత‌మంది అభిమానుల పలు రకాల సృజనాత్మక భావ ప్రకటన రూపాలను కేసీఆర్ స్వీకరించారు.
తమ అభిమానాన్ని చాటుకునేందుకు తనకోసం ప్రత్యేకించి తయారుచేసిన కళారూపాలను కేసీఆర్ స్వీకరించారు.
ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ తోసహా బిఆర్ఎస్ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాజీ ఎంపీలు, పార్టీ సీనియర్ నాయకులు కేసీఆర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
* * *

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles