Telangana Agriculture | రైతుల మేలు కోసం చర్యలు చేపట్టాలి
అధికారులతో సమీక్షించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
Hyderabad : రాష్ట్రంలోని రైతులకు మేలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో
వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి రఘునంధన్ రావు ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పామ్ ఆయిల్ ప్రగతి, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ద్వారా ఫ్యాక్టరీల ఏర్పాటు, అలాగే తోట పంటలు , ఉద్యాన వన పంటలు, కూరగాయలు వంటి సాగు విస్తీర్ణం పెంచే దిశగా చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత అంశాలపై హార్టికల్చర్ శాఖ, ఆయిల్‌ఫెడ్ కార్పొరేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో పామ్ ఆయిల్ సాగు విస్తరణ, రైతులకు అందించాల్సిన ప్రోత్సాహకాలు, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, మార్కెటింగ్ సదుపాయాలు, ప్రభుత్వ సహాయ సహకారాలపై సమీక్షించారు.
* * *