Power to Padmashali | ఉమ్మడి పోరాటాల వల్లే రాజ్యాధికారం సాధ్యం
-తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమర్తపు మురళి
-ఈ నెల 12 పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో 23వ దసరా మేళా
-పెద్ద సంఖ్యలో హాజరు కావాలి పిలుపునిచ్చిన మురళి
Vikasamnews Hyderabad : రాష్ట్రంలో పద్మశాలీల ఐక్యత, ఉమ్మడి పోరాటాలతోనే రాజ్యాధికారం సాధించవచ్చు అని, అందుకోసం అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమర్తపు మురళి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ సర్కిల్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొత్తపేటలోని ఆ సంఘ కార్యాలయంలో ఈనెల 12 న నిర్వహించే 23వ దసరా మేళా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఎల్బీనగర్ సర్కిల్ అధ్యక్షుడు పున్నగణేష్ నేత అధ్యక్షతన సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ.. గత 22 సంవత్సరాల నుండి క్రమం తప్పకుండా, పద్మశాలీ కులస్థుల అభివృద్ధి కోసం ప్రతి సంవత్సరం ఆత్మీయ మేళాను నిర్వహించడం చాలా గొప్ప విషయమని ఆయన నిర్వాహకులకు అభినందించారు. ఇలాంటి మేళాలను నిర్వహించడం ద్వారా, పద్మశాలీల ఐక్యత పెంపొందించుకోవడం ద్వారా, సమాజంలో ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెందడానికి అవకాశం కలుగుతుంది ఆయన అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక సంఖ్యలో పోటీ చేసి, పద్మశాలీల సత్తా ఏమిటో సమాజానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి సమావేశాల ద్వారా.. పద్మశాలీ కులస్థులలో ఆత్మ విశ్వాసం పెంపొందించుటకు మాత్రమే కాకుండా, కుల బాంధవుల సమైక్యతకు కూడా తోడ్పడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ విధమైన దసరా మేళాలలో మనం అధిక సంఖ్యలో పాల్గొని రాజకీయ పార్టీలకు మన బలం ఏంటో నిరూపించాల్సిన సమయం ఆసన్నమైంది అని పిలుపునిచ్చారు.
కొనసాగింపుగా అక్టోబర్ 12 న వనస్థలిపురంలోని హరిణి వనస్థలి ఎకో పార్కు లో దసరా మేళ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగే ఈ ఆత్మీయ సమ్మెళనానికి రాష్ట్రంలో పద్మశాలీ కులస్థులంతా పెద్ద ఎత్తున హాజరు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో దసరా మేళ కమిటీ చైర్మన్ కౌకుంట్ల రవితేజ, అఖిలభారత పద్మశాలి సంగం మీడియా విభాగం జాతీయ అధ్యక్షులు అవ్వారి భాస్కర్ , తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్, గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షులు కత్తుల సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.
* * *