BC Residential Schools | బీసీ గురుకుల ప్రైవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తులు పొడిగింపు
దరఖాస్తులకు ఏప్రిల్ 6 వరకు గుడువు
నోటిఫికేషన్ విడుదల
Hyderabad : రాష్ట్రంలోని మహాత్మాజ్యోతిబా ఫూలే బీసీ గురుకుల పాఠశాలలో 6 నుంచి 9వ తరగతిలో మిగిలిన సీట్ల (బ్యాగ్ లాగ్ సీట్ల) భర్తీ కొరకు ఆన్‌లైన్ దరఖాస్తుల దాఖలుకు గడువు పొడిగించారు. వాస్తవానికి ఈ నెల 31కే ఆన్‌లైన్ గడువు ముగియాల్సి ఉంది. కాని ఆ గడువు తేదీని ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 6 వరకు పొడిగించారు. అయితే ఈ అవకాశాని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎంజేపి కార్యదర్శి బడుగు సైదులు సోమవారం తెలిపారు. ఇందులో మొత్తం బ్యాగ్ లాగ్ సీట్లు 6832 ఉన్నాయన్నారు. ప్రైవేశ పరీక్ష ఏప్రిల్ 20 (ఆదివారం) ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ గురుకుల పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న 6, 7, 8, 9వ తరగతుల సీట్లను భర్తీ చేయడానికి నిర్వహించే ప్రవేశ పరీక్షకు అర్హులైన విద్యార్థులు ఈ నెల ఏప్రిల్ 6 లోగా www.mjptbcwreis.telangana.gov.in లేదా https://mjptbcadmissions.org వెబ్‌సైట్లలో దరఖాస్తు చేసుకోవాలని బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి తెలుపుతూ ఆమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
* * *