Gitam University | కుండల తయారీ వ‌ల్ల శారీర‌క చురుకుతనం 

Gitam University | కుండల తయారీ వ‌ల్ల శారీర‌క చురుకుతనం
మాన‌సిక ప్ర‌శాంత‌తకు బంక‌మ‌ట్టి
కుండ‌ల వ‌ల్ల అనేక ఉప‌యోగాలు
గీతం యూనివ‌ర్సిటీలో కుండ‌ల త‌యారిపై ఒక్క రోజు వ‌ర్క్ షాపులో విద్యార్థుల‌కు అవ‌గాహ‌న‌
ఆస‌క్తిగా పాల్గొన్న విద్యార్థులు

Hyderabad : ఇప్ప‌టి వ‌ర‌కు విద్యార్థులో ఇంజినీరింగ్ విద్య‌, డాక్ట‌ర్ విద్యాతో పాటు ఇత‌ర వ్రుత్తి విద్యా, ఉపాధి కోర్సుల‌ను నేర్చుకోవ‌డ‌మే చూశాం. లేదా ఎల క్ట్రిషియ‌న్‌, బ్యూటీషియ‌న్‌, డ్రైవింగ్, రిపేరింగ్ వంటి కోర్సుల‌పైనా యువత ఆస‌క్తి చూపుతుంది. అలాగే ఏ సాఫ్ట్‌వేర్, బ్యాంకింగ్‌, హోట‌ల్ మేనేజ్‌మెంటో వంటి ఉద్యోగాల‌నే కోరుకుంటాం. త‌ల్లిదండ్రులు కూడా వాటినే ప్రోత్స‌హిస్తారు. లేదంటే అమెరికా, ఆస్ట్రేలియా, కెన‌డా, లండ‌న్ వంటి దేశాల‌కు వెళ్తాం. కాని కుండ‌లు త‌యారు చేయ‌డం ఎవ‌రైనా నేర్చుకుంటారా? అందుకు సంబంధించిన విద్య ప‌ట్ల ఎవ‌రైనా ఆస‌క్తి చూపుతారా? ప్ర‌స్తుత స‌మాజంలో ఎవ‌రూ ఉండ‌ర‌నే చెప్పాలి. కాని.. కుండ‌లు త‌యారు చేసే విద్యా విధానం కూడా ప్ర‌స్తుతం అందుబాటులోకి వ‌చ్చింది.
గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ఎస్) లోని మీడియా స్టడీస్ విభాగం ఆధ్వర్యంలో నిర్వ‌హించిన ఒక కార్య‌క్ర‌మంలో కుండ‌లు త‌యారు చేసే విధానం గురించి ఏర్పాటు చేసిన వ‌ర్క్‌షాపులో వీటి గురించి బోధించారు. పై అవగాహన జీఎస్ హెచ్ఎస్ లోని లలిత, ప్రదర్శన కళల విభాగం కుండల తయారీపై అత్యంత ఆకర్షణీయంగా ఒక్క‌ రోజు వ‌ర్క‌షాపు నిర్వహించింది. ఇందులో పాల్గొన్నవారికి, మట్టితో పనిచేయడం వల్ల కలిగే సృజనాత్మక, చికిత్సా ప్రయోజనాలను తెలియజేశారు. కుండలు మానసిక దృష్టి, ఏకాగ్రతను ఎలా పెంచుతాయో, సృజనాత్మక ప్రక్రియకు మించి రోజువారీ జీవితంలోకి విస్తరించే ప్రశాంతతను, సద్భుద్ధిని ఎలా పెంపొందిస్తాయో ఈ వ‌ర్క్‌షాపులో అవగతం చేశారు.
*మాన‌సిక ప్ర‌శాంత‌తంగా బంక‌మ‌ట్టి..
చికిత్సా లక్షణాలకు ప్రసిద్ధి చెందిన కుండలు చేతులను బలపరుస్తాయని, ఒత్తిడిని తగ్గిస్తాయని, మొత్తం మీద స్వాంతనను ఇస్తాయని నిర్వాహకులు వివరించారు. బంకమట్టిని అచ్చువేసే స్పర్శ అనుభవం, ఆందోళన తగ్గించడానికి సహాయపడడమే గాక, కొంత ఉపశమనం ఇవ్వడంతో పాటు మానసిక, శారీరక చురుకుదనాన్ని పెంచుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, జీఎస్ హెచ్ఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ సన్నీ జోస్, కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ వై.లలితా సింధూరి, కోర్సు సమన్వయకర్త డాక్టర్ ఆదిశేషయ్య సాడే తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ కార్య‌క్ర‌మానికి అసోసియేషన్ ఆఫ్ డిజైనర్స్ ఇండియా, ఐఐటీ హైదరాబాదులు సహకారం అందజేశాయి.
* * *

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version