Three language Formula In Tamilnadu | నేను ఉగ్రవాదినా..? నన్నెందుకు చుట్టు ముట్టారు
పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన తమిళిసై సౌందరరాజన్
త్రిభాషా సూత్రానికి మద్ధతుగా నిలిచిన తమిళిసై
సంతకాలు సేకరిస్తూ పోలీసులకు చిక్కిన తెలంగాణ మాజీ గవర్నర్
పోలీసుల అదుపులో మాజీ గవర్నర్ తమిళిసై
Hyderabad : తమిళనాడుతో త్రిభాషా సూత్రానికి మద్దతుగా తమిళిసై సౌందరరాజన్ చేపల్లిన సంతకాల ప్రచారాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను పోలీసులు అరెస్టు చేసినట్లు జోరుగా ప్రచారం నడిచింది. అయితే సౌందరరాజన్‌ను తాము అరెస్టు చేయలేదని, ఈ ప్రచారం ప్రజలకు, ట్రాఫిక్‌కు అంతరాయం కలుగడం వల్ల అక్కడి నుండి తరలించాలని మాత్రమే తాము కోరినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే తమిళి సై మూడు భాషల సూత్రానికి (Three language Formula) మద్దతుగా సంతకాల ప్రచారాన్ని చేపట్టారు. అయితే డిఎంకె మద్దతుదారుల బృందం కూడా ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న సమయంలో ఇరువురు సంఘటనా స్థలంలో గుమిగూడడం వల్ల ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
“నేను ఏదైనా శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తున్నానా? నేను ఉగ్రవాదినా? నన్ను ఎందుకు చుట్టుముట్టారు? నేను గత 40 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్నాను, నేను శాంతియుతంగా సంతకం ప్రచారాన్ని నిర్వహిస్తున్నాను,” అని సౌందరరాజన్ పోలీసులు సంతకం ప్రచారాన్ని ముగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరిన సమయంలో వారితో చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో మహిళా పోలీసు సిబ్బంది సౌందరరాజన్‌ను చుట్టుముట్టి ఆమె కదలికలను అడ్డుకున్నారు. ఆమె సంతకం ప్రచార కార్యక్రమం ప్రజలకు, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తోందని పోలీసులు తెలిపారు.
ఇంతలో, డిఎంకె సభ్యుల బృందం తమిళిసై సౌందర రాజన్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అయితే వారు రెండు భాషల సూత్రానికి మద్దతుగా నినాదాలు చేశారు. రెండు పార్టీల సభ్యులు ముందుకు సాగకుండా పోలీసులు వేగంగా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. గందరగోళం మధ్య, కొంతమంది వ్యక్తులు రోడ్డుపై అడ్డుకున్నారు. తరువాత పోలీసులు 23 మందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రచారం వల్ల ప్రజలకు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నందు వల్ల సౌందరరాజన్‌ను అరెస్టు చేయలేదని, అక్కడి నుండి తరలించమని మాత్రమే కోరినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అనంతరం తరువాత పోలీసులు ఆమెను సంఘటన స్థలం నుండి తీసుకెళ్లారు.
అనంతరం సౌందరరాజన్ విలేకరులతో మాట్లాడుతూ, “నేను మూడు గంటల పాటు ఎండలో వేచి ఉండాల్సి వచ్చింది. బిజెపి మూడు భాషల విధానానికి మద్దతు ఇచ్చే సంతకం ప్రచారం పట్ల డిఎంకె ప్రభుత్వానికి ఉన్న భయాన్ని ఇది చూపిస్తుంది. ప్రదర్శన నిర్వహించవద్దని నా పార్టీ సభ్యులకు చెప్పాను. మేము సంతకం ప్రచారాన్ని శాంతియుతంగా నిర్వహిస్తున్నాను. ఒక రాజకీయ నాయకుడిని ప్రజలను కలవకుండా ఆపడానికి వారెవరు? అయినప్పటికీ ప్రజలు బయటకు వచ్చి మా సంతకం ప్రచారానికి మద్దతు ఇచ్చారు. నాకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన డిఎంకె సభ్యులపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోకపోవడాన్ని నేను ఖండిస్తున్నాను. ” అని తమిళి సై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బిజెపి తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై సోషల్ మీడియా పోస్ట్‌లో సౌందరరాజన్ సంతకం ప్రచారాన్ని చేపట్టకుండా పోలీసులను అడ్డుకోవడాన్ని ఖండించారు. “ప్రైవేట్ పాఠశాలల్లో మూడు భాషలను అనుమతించడం, ప్రభుత్వ పాఠశాలల్లో రెండు భాషల సూత్రాన్ని స్వీకరించడంపై డిఎంకె యొక్క ద్వంద్వ ప్రమాణాలు బహిర్గతమయ్యాయి. డిఎంకె నాటకాన్ని ప్రజలు గ్రహించడం, త్రిభాషా విధానానికి భారీ మద్దతు ఇవ్వడం ప్రారంభించారు” అని ఆయన అన్నారు.
* * *