Miss World Compititions | న‌గ‌రానికి త‌ర‌లి వ‌స్తున్న అందాల భామ‌లు

Miss World Compititions | న‌గ‌రానికి త‌ర‌లి వ‌స్తున్న అందాల భామ‌లు
ఈ నెల 10 నుంచి ప్రారంభ కానున్న మిస్‌వ‌ర‌ల్డ్ – 2025 పోటీలు
ఏర్పాట్లు పూర్తి చేసిన తెలంగాణ స‌ర్కారు
న‌గ‌రాన్ని స‌ర్వాంగ సుంద‌రంగా తీర్చి దిద్దుతున్న స‌ర్కారు
Hyderabad : హైద‌రాబాద్ న‌గ‌రంలో ఈ నెల‌10 నుంచి ప్రారంభం కాబోతున్న అందాల పోటీల‌లో (Miss World Compititions) పాల్గొన‌డానికి వివిధ దేశాల నుంచి అంద‌గ‌త్తెలు వ‌స్తున్నారు. ఇప్ప‌టికే బ్రెజిల్‌, ఇండోనేషియా, ఆఫ్రికా ప‌లు దేశాల‌కు చెందిన అందాభామ‌లు ఆదివారం హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇప్పటివరకు కెనడా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా కు చెందిన ప్రతినిధులు హైదరాబాద్ వచ్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న మిస్ సౌత్ ఆఫ్రికా కు తెలంగాణ ప్రభుత్వ అధికారులు బృందం తెలంగాణ సంప్ర‌దాయాలు ప్ర‌తిబింబిందే విధంగా స్వాగతం పలికారు.
మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు హైదరాబాద్ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. వందకు పైగా దేశాల నుంచి వచ్చే అందాల భామలకు స్వాగతం ప‌లికేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టును అధికారులు ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో విదేశీ ప్రతినిధులకు స్వాగతం పలికేందుకు అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. సోమ‌వారం నుంచి విదేశీ ప్రతినిధుల రాక పెరగనుంది. ఇందుకోసం ఎయిర్ పోర్ట్ లో ప్రత్యేక లాంజ్ లతో పాటు, హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేశారు. అలాగే తెలంగాణ పర్యాటక ప్రాంతాలు, ప్రత్యేక చిహ్నాలతో కూడిన స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. `తెలంగాణ జరూర్ ఆనా` (Must Visit Telangana) నినాదం ప్రతి చోటా కనిపించేలా, వినిపించేలా పర్యాటకశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.
* అయితే రాష్ట్రంలో నిర్వ‌హిస్తున్న అందాల భామ‌ల పోటీల‌ను.. కొన్ని మ‌హిళా సంఘాలు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాయి. మ‌హిళా స‌మ‌స్య‌ల‌తో పాటు రైతులు, చేనేత‌లు, కార్మికులు, క‌ర్ష‌కుల స‌మ‌స్య‌లు ఎక్క‌డ వేసిన గొంగ‌లి అక్క‌డే అన్న చందంగా ఉన్నాయ‌ని, వాటిని ప‌రిష్క‌రించ‌కుండా.. ప్ర‌జాధ‌నం వ్రుదా చేస్తు.. ఇలాంటి అందాల భామ‌ల పోటీల‌కు నిధుల ఖ‌ర్చు చేయ‌డంపై ప్ర‌తి ప‌క్ష పార్టీల నుంచి వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతుంది.
* * *

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version