Inter Exam time | రేపటి నుంచి ఇంటర్ ప‌రీక్ష‌లు

Inter Exam time | రేపటి నుంచి ఇంటర్ ప‌రీక్ష‌లు
5 నిమిషాలు ఆలస్యమైనా పరీక్ష‌కు అనుమ‌తి
తెలంగాణ ఇంటర్‌ బోర్డు కార్యదర్శి వెల్లడి
ఇంటర్ ప‌రీక్ష సెంటర్‌కు చేరుకోవ‌డానికి 9:05 వరకు ఛాన్స్‌
ప‌రీక్ష‌ల కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఇంట‌ర్ బోర్డు అధికారులు
Hyderabad : తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 5 నుంచి (బుధ‌వారం) నుంచి ఇంటర్‌ వార్షిక పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇంట‌ర్ బోర్డు అధికారులు పూర్తి చేశారు. ఉద‌యం 9 గంట‌ల నుంచి ప‌రీక్ష‌లు ప్రారంభం అవుతాయి. అయితే ప‌రీక్ష స‌మ‌యం కంటే 5 నిమిషాలు ఆల‌స్యంగా వ‌చ్చే విద్యార్థుల‌కు మిన‌హాయింపు ఇచ్చిన‌ట్లు సోమ‌వారం బోర్డు అధికారులు ప్ర‌క‌టించారు. తొలుత ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌కు ఉదయం 8:45 గంటలలోపు వస్తేనే అనుమతిస్తామన్న నిబంధన విధించారు. కాని ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం ప్ర‌కారం ఆ నిబంధ‌న వెన‌క్కి తీసుకున్నారు. 9:05 గంటల వరకు వచ్చిన విద్యార్థులను సైతం పరీక్షకు అనుమతించనున్నట్టు ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య వెల్లడించారు. ఈ సారి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన వారిని కూడా పరీక్షకు అనుమతిస్తామని పేర్కొన్నారు. అయితే ఉదయం 8:45 గంటల వరకు వచ్చిన వారిని మాత్రమే అనుమతిస్తామని హాల్‌టికెట్లపై ముద్రించిన‌ట్లు తెలిపారు. అయితే విద్యార్థులు త్వరగా పరీక్షా కేంద్రాలకు వస్తే టెన్షన్‌కు గురవకుండా పరీక్షరాస్తారన్న ఆలోచనతో హాల్‌టిక్క‌ట్ల‌పై ఈ ఆ విధంగా ముద్రించిన‌ట్లు బోర్డు సెక్రెట‌రీ వివ‌ర‌ణ ఇచ్చారు. అయితే 8.45 గంట‌ల లోపు మాత్ర‌మే ప‌రీక్ష‌ల‌కు అనుమ‌తిస్తామ‌న్న ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో విద్యార్థులు, త‌ల్ల‌దండ్రుల‌లో ఆందోళ‌న వ్య‌క్త‌మైంది. ఈ మేర‌కు కొన్ని మీడియాలో కూడా క‌థ‌నాలు ప్ర‌చురిత‌మ‌య్యాయి. దీనిక స్పందించిన బోర్డు ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్న‌ది.
ఇంటర్‌ వార్షిక పరీక్షల నేపథ్యంలో సోమవారం నాంపల్లిలోని ఇంటర్‌బోర్డు కార్యాలయంలో కృష్ణఆదిత్య ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుడు ఓ విద్యార్థి ఆలస్యంగా పరీక్షకు వచ్చి ఆత్మహత్య చేసుకున్నారని, ఈ ప్రత్యేక పరిస్థితుల్లో సడలింపు ఇచ్చామని చెప్పారు. ఈ నెల 5 నుంచి 25 వరకు జరిగే ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేశామని పేర్కొన్నారు. ‘ఇంటర్‌ పరీక్షలు తొలి ప్రయత్నం.. జీవితంలో తొలి అడుగు మాత్రమే. పరీక్షలు బాగా రాయలేదన్న నెపంతో విద్యార్థులెవరూ ఆత్మైస్థెర్యం కోల్పోవద్దు’ అని ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య విద్యార్థుల‌కు సూచించారు. పరీక్షలు బాగా రాయకపోయినా.. ఫెయిలైనా ఇదే ముగింపుగా భావిచ‌వ‌ద్ద‌న్నారు.
* * *

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version