Telangana rajeev yuva vikasam | అందుబాటులోకి రాజీవ్ యువ వికాసం
ఈ నెల 17 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ
నోటిఫికేషన్ విడుదల చేసిన ట్రైకార్
యువ వికాసాన్ని అధికారికంగా ప్రారంభించనున్న సీఎం రేవంత్, మంత్రులు
Hyderabad : రాష్ట్రంలో గరిజన యవత కోసం రాజీవ్ యువ వికాసం అనే నూతన పథకాన్ని కొత్తగా అందుబాటులోకి తీసుకువస్తు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఈ శనివారం శనివారం ప్రజా భవన్ లో రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభం పై డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క,మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశమయ్యారు. రాజీవ్ యువ వికాసం పథకం విధి విధానాల పై చర్చంచారు. ఈ సమావేశంలో ఎస్సీ ,ఎస్టీ , మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ లు ప్రితం ,బెల్లయ్య నాయక్, ఒబేదుల్ల కొత్వాల్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో సోమవారం (ఈ నెల 17) నుంచి రాజీవ్ యువ వికాసం పథకం అప్లికేషన్ స్వీకరణ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 5 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారని పేర్కొననారు. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇతర మంత్రులు పాల్గొంటారు. ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతీ యువకులకు సువర్ణ అవకాశంగా రాజీవ్ యువ వికాసం పథకం అందుబాటులో ఉంటుందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఏర్పరచడానికి రాజీవ్ యువ పథకం అందుబాటులోకి వచ్చినట్లు డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
ఈ మేరకు శనివారం తెలంగాణ షెడ్యూల్ తెగల ఆర్థిక సహకార సంస్థ లిమిటెడ్ (ట్రైకార్) అధికారికగా ప్రకటించింది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు. పూర్తి వివరాల కోసం https://tgobmmsnew.cgg.gov.in అనే వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారని పేర్కొన్నారు.
* * *