Heavy Temparature in Telangana | రాష్ట్రంలో మండుతున్న ఎండలు..
40 డిగ్రీలకు పై ఉష్ణోగ్రతలు నమోదు
బెంబేలెత్తుతున్న జనాలు
జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక
Hyderabad : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మార్చి మూడో వారంలోనే రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు వరంగల్, ఖమ్మం, కరీంనగర్, అదిలాబాద్, మెదక్ వంటి పలు జిల్లా ల్లో 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సాధారణం కంటే 3.3 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటోంది. కాగా.. వచ్చే పది రోజుల్లో తెలంగాణలో కాస్త భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడబోతున్నట్టు తెలంగాణ వాతావరణ నిపుణులు చెప్తున్నారు.
అలాగే.. తెలంగాణకు సంబంధించిన వెదర్‌మెన్ కూడా కీలక వాతావరణానికి సంబంధించి కీలక సమాచారం అందించాడు. మార్చి 19 వరకు వేడిగాలులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అయితే.. మార్చి 20 నుంచి 24 తేదీల్లో మాత్రం రాష్ట్రంలో అకాల వర్షాలు కురిస్తాయని హెచ్చరించాడు. అవి కూడా బలమైన ఉరుములతో కూడిన అకాల వర్షాలు కురుస్తాయని స్పష్టం చేశాడు. అయితే.. ఈ వాతావరణం ఎప్పటికప్పుడు మారుతుందని కూడా పేర్కొన్నారు. ప్రస్తుతానికి మాత్రం వేడికి బాధపడాల్సిందేనని.. మార్చి 20 తర్వాత మాత్రం రైతులు కాస్త జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ వెదర్ మెన్ సూచించాడు.
* * *