lucky draw coupon | స‌ర్, మీకు ల‌క్కీ డ్రా తీసీ గిఫ్ట్ ఇస్తాం..

lucky draw coupon | స‌ర్, మీకు ల‌క్కీ డ్రా తీసీ గిఫ్ట్ ఇస్తాం..
అంటే.. న‌మ్మ‌కండి.
ఫోన్ నెంబర్ ను ఎవ‌రికీ ఇవ్వకండి
ఇస్తే మోస పోయిన‌ట్టే
పౌర సరఫరాల శాఖ ఎన్ ఫోర్స్‌మెంట్ డీటీ రఘునందన్ సూచ‌న‌

Hyderabad : `సర్..మీ ఫోన్ నెంబర్ ఇస్తారా.. లక్కీ డ్రా తీసి గిఫ్ట్ ఇస్తాం.. అoటూ పెట్రోల్ బంకుల్లో, సినిమా హళ్ల వద్ద, షాపింగ్ మాళ్లు వంటి ర‌ద్దీ ప్రాంతాల‌లో కొందరు యువ‌తి, యువ‌కులు మన ఫోన్ నెంబర్లను అడిగి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ల చేత చిక్కోద్దు. వాళ్ల‌కు మనకు ముఖ్య‌మైన‌ సెల్ నంబర్ ఇవ్వొద్దు. ఇస్తే ఇక మోస పోయిన‌ట్లే` అని వినియోగదారుల వ్యవహారాలు, పౌర సరఫరాల శాఖ ఎన్ ఫోర్స్‌మెంట్ డిప్యూటి త‌హ‌సీల్దార్ (DT) మాచన రఘునందన్ స్పష్టం చేశారు. ఈ మేర‌కు శుక్రవారం ఆయన హైదరాబాద్ లో మాట్లాడుతూ.. కొన్ని వ్యాపార సంస్థలు తెలివిగా, జ‌న సంచారం ఉన్న ప్రాంతాల‌లో నిరుద్యోగ యువతతో, ప్ర‌జ‌ల వద్ద నుంచి, మ‌రీ ముఖ్యంగా ఫ్యామిలీ లేడీస్‌ను టార్గెట్‌గా చేసుకుంటున్నార‌ని తెలిపారు. అలాగే వారి నుంచి ఫోన్ నెంబర్లను సేకర‌స్తున్నాయ‌ని, ఆ తర్వాత ఆ యా ఫోన్ నెంబర్లకు కాల్ చేస్తే అస‌లు విష‌యం తెలుస్తుంద‌న్నారు. `స‌ర్..మీ కు లక్కీ డ్రా లో గిఫ్ట్ వచ్చింది, ఫ్యామిలీ తో రండి, గిఫ్ట్ తీసుకెళ్లoడి అంటూ.. పలు రకాల మోసాలకు పాల్పడే అవకాశం ఉందని రఘునందన్ ప్ర‌జ‌ల‌కు హెచ్చరించారు.పెట్రోల్ బంకు యాజమాన్యాలు, సినిమా థియేట‌ర్ల‌ ల వద్ద, జనం జాగృతంగా ఉండాల‌ని తెలిపారు. తమ ఫొన్ నెంబర్ లను ఇవ్వకుండా జాగ్రత్త గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సంద‌ర్భంగా రఘునందన్ సూచించారు.
ఈ క్ర‌మంలో కొంత మంది మోసాగాళ్లు.. ఫ్యామిలీ సెంటిమెంట్‌ను వాడుకుంటున్నారు. అమాయ‌కురాలైన ఫ్యామిలీ ఆడ‌వాళ్ల‌ను ల‌క్ష్యం చేసుకుంటున్నారు. వారికి లేనిపోని మాట‌లు చెప్పి, భ‌ర్త భార్త‌ల‌తో స‌హా త‌మ మీటింగ్ కు వ‌చ్చే విధంగా న‌మ్మ బ‌లుకుతున్నారు. ఒక వేళ ఆశ‌తో ఆ మీటింగ్‌కు హాజ‌రైతే.. ఏవో ర‌క‌ర‌కాల‌ ప‌త్రాల‌పై సంత‌కాలు చేయిస్తారు. మ‌న‌కు సంబంధించి డాక్యుమెంట్లు అడుగుతారు. ర‌క‌ర‌కాల డాక్యుమెంట్ల‌పైనా సంత‌కాలు పెట్టించుకుని, ఆ త‌ర్వాత అస‌లు క‌థ మొద‌లు పెడుతారు. త‌మ‌రు ఇక్క‌డ సంత‌కం చేశారు.. అక్క‌డ సంత‌కం చేశారు.. అందుక‌ని కోర్టుకు రావాలి, లేదా పోలీసు స్టేష‌న్‌కు రావాలి.. లేదంటే జైలుకు పోతారు, కాదంటే ల‌క్ష‌లు చెల్లించాల్సి ఉంటుంది.. వంటి ర‌క‌ర‌కాల భ‌య‌భ్రాంతుల‌కు గురిచేసి, త‌మ వ‌ద్ద నుంచి ల‌క్ష‌ల్లో న‌గ‌దు వ‌సూలు చేస్తున్నారు. దీంతో గిఫ్టు కూప‌న్‌కు ఆశ ప‌డి, ఎవ‌రికీ కూడా అడిగిన వెంట‌నే మోబైల్ ఫోన్ ఇవ్వోద్ద‌ని ప‌లువురు అధికారులు ప్ర‌జ‌ల‌ను హెచ్చ‌రిస్తున్నారు.
* * *

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version