NATIONAL NO SMOKING DAY | పొగాకు పై 22 ఏళ్ల నిశ్శబ్ద పోరాటం

NATIONAL NO SMOKING DAY | పొగాకు పై 22 ఏళ్ల నిశ్శబ్ద పోరాటం
*దేశ స్థాయిలో “టుబాకో కంట్రోల్ హీరో”గా మాచన రఘునందన్
* రాష్ట్రపతి భవన్ నుంచి
* “హలో..యే..రఘునందన్ మాచన హై? ! అనే పిలుపు.
*మార్చి 11న‌ నేషనల్ నో స్మోకింగ్ డే సందర్భంగా..ఈ ప్రత్యేక కథనం
VikasamNews/Hyderabad : పొగాకు వ్యసనం సమాజాన్ని క్రమంగా కుదేలు చేస్తున్న ఈ త‌రుణంలో , ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి తన నిస్వార్థ కృషితో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆ వ్యక్తి పేరు మాచన రఘునందన్. ఆయన చేసిన సేవలకు గాను టుబాకో నియంత్రణలో అత్యున్నత గౌరవమైన “టుబాకో కంట్రోల్ హీరో” అవార్డు ఆయనను వరించింది. గ‌త 22 ఏళ్లుగా సాగుతున్న నిశ్శబ్ద పోరాటం ఇది. “సార్… నో స్మోకింగ్ ప్లీజ్” అని వినయంగా చెప్పడం ఆయన అలవాటు. 22 సంవత్సరాలుగా ఆయన ఈ మాటను వేలాది మందికి చెబుతూ, పొగాకు వ్యసనం వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ కృషి దేశవ్యాప్తంగా వైద్య నిపుణులు, సామాజిక కార్యకర్తల దృష్టిని మాత్రమే గాక అటు సుప్రీంకోర్టు ను ఇటు రాష్ట్రపతి భవన్ ను సైతం ఆకర్షించింది.
*వైద్యుడు కాదు… కానీ సమాజానికి వైద్యుడే..
వైద్యులు చెబుతున్న మాట ఒకటే “మేము రోగులకు చికిత్స చేస్తున్నాం. కానీ రఘునందన్ మాత్రం సమాజానికి చికిత్స చేస్తున్నారు.” వైద్య వృత్తికి సంబంధం లేకపోయినా, సమాజ ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఆయన చేస్తున్న కృషి అసాధారణమని వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. అత్యున్నత గౌరవం. పొగాకు నియంత్రణపై విశేషంగా పనిచేసే వ్యక్తులకు రిసోర్స్ సెంటర్ ఫర్ టొబాకో కంట్రోల్ (ఆర్సి టి సి) సంస్థ ప్రతి సంవత్సరం “టోబాకో కంట్రోల్ హీరో” అవార్డు అందిస్తుంది. దేశవ్యాప్తంగా ఎంపికైన 15 మందిలో మాచన రఘునందన్ మాత్రమే వైద్యేతర వ్యక్తి. అలాగే దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎంపికైన ఏకైక వ్యక్తిగా నిలిచారు.
ప్రస్తుతం ప్రభుత్వంలో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్న రఘునందన్, విలాసవంతమైన జీవితం గురించి ఆలోచించకుండా సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. పొగాకు వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించడం, యువతను దూరం చేయడం ఆయన జీవిత లక్ష్యంగా మారింది. రఘునందన్ చేస్తున్న ఈ కృషి ఒక “నిశ్శబ్ద విప్లవం”గా చెప్పవచ్చు. ఎలాంటి ప్రచారం లేకుండా, హడావుడి లేకుండా సమాజంలో మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తున్న నిజమైన హీరో ఆయన. మాచన రఘునందన్ అనే పేరు ఇకపై కేవలం ఒక అధికారి పేరు మాత్రమే కాదు. పొగాకు మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడిన ఒక ప్రేరణాత్మక వ్యక్తిత్వంగా చరిత్రలో నిలిచే పేరు. ఆయన పొందిన హీరో అవార్డు కేవలం ఒక గౌరవం కాదు నిస్వార్థ సేవకు లభించిన కిరీటం.
* * *

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version