Telangana Assembly Sessions | రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు
శాంతిభద్రతలు విఘాత కలుగకుండా చర్యలు
అసెంబ్లీ సమావేశాలకు కట్టుదిట్టమైన చర్యలు
మూడంచెల భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులకు ఆదేశాలు
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసిన స్పీకర్ ప్రసాదరావు
పాల్గొన్న మండలి ఛైర్మన్ గుత్త సుఖేందర్‌రెడ్డి, మంత్ర శ్రీధర్‌బాబు, సీఎస్, డీజీపీ
Hyderabad : రాష్ట్రంలో బుధవారం నుంచి (మార్చి 12, 2025 నుండి) తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాల ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపధ్యంలో అసెంబ్లీ నిర్వాహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ ఉన్నతాధికారులతో మంగళవారం శాసనసభ భవనంలోని స్పీకర్ ఛాంబర్ లో ముందస్తు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ నిర్వహించారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, లెజిస్లేటివ్ సెక్రటరీ వి నరసింహా చార్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సమావేశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు మాట్లాడుతూ బుధవారం నుండి తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం అవుతున్నాయన్నారు. గత సమావేశాలు సజావుగా జరగడానికి సహకరించిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, శాసనసభ అధికారులు, సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాల హుందాతనాన్ని పెంపొందించే విదంగా ఏర్పాట్లు ఉండాలని కోరారు. ఈ సారి జరిగేవి బడ్జెట్ సమావేశాలు కాబట్టి ఎక్కువ రోజులు జరుగుతాయన్నారు. గతంలో మాదిరిగానే ఈ సమావేశాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు సహకారం అందించాలని కోరారు. సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని ఆదేశించారు. సభలో సభ్యులు ప్రస్తావించిన అన్ని అంశాలకు సంబంధించిన సరైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సభకు, సభ్యులకు అందించాలని పేర్కొన్నారు. సభకు సమర్పించే సమాధాన పత్రాలను ముందుగానే పంపినట్లయితే వాటిని సభ్యులు చదువుకొని సభలో మాట్లాడడానికి, చర్చించడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. సమాచారాన్ని తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషలలో ముద్రించి ముందస్తుగా సభ్యులకు అందించితే వారు సన్నద్ధం కావడానికి ఉపయోగపడుతుంది. శాఖలకు సంబంధించిన చర్చ జరుగుతున్నప్పుడు సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉంటూ మంత్రులకు, సభ్యులకు తగిన సమాచారం అందిస్తూ సహకరించాలని పేర్కొన్నారు. శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరగడానికి పోలీసు శాఖ తరుపున చర్యలు తీసుకోవాలి.
*కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్ర శాసన సమావేశాలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమిష్టిగా పని చేయాలని ఆదేశించారు. సభా సమావేశాలు జరిగే సమావేశం అన్ని శాఖల అధికారులు , మంత్రులు , ప్రజా ప్రతినిధులు తప్పకుండా హాజరుకావాలని సూచించారు. నోడల్ అధికారులను , లైజనింగ్ ఆఫీసర్లను నియమించాలని కోరారు. అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో చాలా సంఘాలు చలో అసెంబ్లీ కార్యక్రమాలకు పిలుపునిచ్చే అవకాశాలు ఉన్నందున పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సమావేశాలు జరిగే రోజుల్లో అసెంబ్లీ , శాసన మండలి చుట్టూ మూడు అంచెల భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆయన సూచించారు. అలాగే వీఐపీల నివాసాలు , అసెంబ్లీకి వచ్చే రూట్ లో కూడా భద్రతను ఏర్పాటు చేయాలి.
ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతికుమారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఫైనాన్స్) రామకృష్ణారావు, జీఏడి సెక్రటరీ రఘనంందన్ రావుతో పాటు హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా, రాష్ట్ర DGP జితేందర్, ADG, (శాంతి భద్రతలు) మహేష్ భగవత్, DG ఫైర్ నాగిరెడ్డి, హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనర్లు -సివి అనంద్, సుధీర్ బాబు, అవినాష్ మహాంతి, ఇంటెలిజెన్స్ IG కార్తికేయ, అసెంబ్లీ ఛీఫ్ మార్షల్- కరుణాకర్, కౌన్సిల్ చీఫ్ మార్షల్ సంజీవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
* * *