Telangana SLBC Works | ఎస్ఎల్‌బీసీ సొరంగం ప్ర‌మాదంపై ముమ్మ‌ర చ‌ర్య‌లు

Telangana SLBC Works | ఎస్ఎల్‌బీసీ సొరంగం ప్ర‌మాదంపై ముమ్మ‌ర చ‌ర్య‌లు
టన్నెల్ వర్క్స్ లలో నిష్ణాతులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి
ప్ర‌మాదంలో చిక్కుకున్న వారిని ర‌క్షించేందుకు కొన‌సాగుతున్న చ‌ర్య‌లు

Hyderabad : శ్రీశైలం ఎడమ కాలువ (SLBC)నిర్మాణ పనుల్లో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మందిని సురక్షితంగా తీసుకురావడానికి ప్రభుత్వం ముమ్మర చర్యల చేసింది. ప్ర‌మాదంలో చిక్కుకున్న వారికి కాపాడే ప‌నులు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఎంతటి ఉన్నతస్థాయి పరిజ్ఞాన న్నైనా ఉపయోగించి సొరంగంలోని చిక్కుకున్న వారిని బయటకు తీయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల‌కు అనుగుణంగా న్యూఢిల్లీతో పాటు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో టన్నెల్ వర్క్స్ లో నిష్ణాతులైన వారిని ప్రత్యేకంగా పిలిపించారు. బుధ‌వారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకున్న రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి, జడ్చర్ల శాసన సభ్యులు అనిరుద్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ , టీఎస్ ఎస్పీడీసీఎల్ సిఎండి ముషరఫ్ అలీ, లు సహాయ చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆర్మీ అధికారులు కల్నల్ బ్లాక్ స్మిత్ మెహ్రా లెఫ్టినెంట్ కల్నల్ హార్పల్, ఎన్డీఆర్ఎఫ్ డి ఐ జి మోహ్సెన్ షహది, ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ ప్రసన్న, నేవీ అధికారి వికె ప్రసాద్, రాబిన్సన్ టన్నెల్ అధికారి గ్లెన్, ర్యాట్ మైనర్స్ బృందం ప్రతినిధి ఫిరోజ్ కురేషి ఈ సమీక్ష సమావేశం లో పాల్గొన్నారు. టన్నెల్ లోపల జరుగుతున్న సహాయక చర్యలను మంత్రులు సమీక్షించారు. డి బిఎం వరకు చేరే మార్గాలను సహాయక బృందాలు పర్యవేక్షిస్తున్నట్లు మంత్రులకు వివరించారు. సహాయక చర్యలకు ఆటంకంగా ఉన్న బురద నీటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
* * *

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version