Andhra Pradesh CM Chadrababu | రాజ‌మండ్రిలో క‌ల్తీపాలు బాధాక‌రం

Andhra Pradesh CM Chadrababu | రాజ‌మండ్రిలో క‌ల్తీపాలు బాధాక‌రం
శ్రీకాకుళంలో డయేరియా, వేట్ల‌పాలెంలో బాణా సంచా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు.
ఇలాంటి ఘటనలు జరగ్గకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారుల‌దే
కలెక్టర్లు, సెక్రటరీలు ఫీల్డ్ విజిట్స్ చేయాలని సీఎం ఆదేశం.
VikasamaNews/Hyderabad : శ్రీ‌కాకులం డ‌యేరియా, రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో క‌ల్తీపాలు, వేట్ల‌పాలెంలో బాణాసంచ లాంటి ఘ‌ట‌న‌లు జ‌రుగ‌డంచాలా బాధాక‌ర‌మ‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు అన్నారు. ఈ మేర‌కు బుధ‌వారం ఏపీలో నిర్వ‌హించిన క‌లెక్ట‌ర్ల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ..
ప్రజల ప్రాణాలు లెక్క చేయకుండా ఎవ్వరు వ్యవహరించినా కఠినంగా ఉంటామ‌ని, స్వార్థపరులు చేతుల్లోకి పరిస్థితులు వెళ్లడానికి వీల్లేదు. ఉదాసీనంగా ఉండబోమ‌ని, నీరు కలుషితం, పాలు కల్తీ అవుతుంటే ఆయా విభాగాలు ఏం చేస్తున్నాయి…? ఈ సంద‌ర్భంగా ఆయ‌న నిల‌దీశారు. బాణా సంచా నిబంధనలకు విరుద్ధం తయారు చేస్తుంటే ఏం చేస్తున్నారు..? ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కలెక్టర్లు కనీసం 8 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందే అని హుకుం జారీ చేశారు. సీనియర్ సెక్రటరీలు 4 రోజుల పాటు క్షేత్రస్థాయికి వెళ్లాలి అని ఆదేశించారు. దీనిపై పోర్టల్ తయారు చేసి ఆన్ లైన్ లో పెట్టేలా సీఎస్ బాధ్యత తీసుకోవాల‌న్నారు.
క్షేత్ర స్థాయి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాల్సింది కలెక్టర్లే అని, ఈ విషయంలో ఎలాంటి రాజీ లేద‌న్నారు. ఏది వాస్తవమో అధ్యయనం చేసుకుని తగిన నిర్ణయం తీసుకునే బాధ్యత కలెక్టర్లదే అని స్ప‌ష్టం చేశారు.
సంజీవని ప్రాజెక్టును సమర్ధంగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలి అని, 72 లక్షల మందికి వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు స్క్రీనింగ్ లో తేలింది తెలిపారు. ప్రతీ ఇంటికి సురక్షితమైన మంచినీరు అందించాలి, గత పాలకులు చేసిన తప్పు వల్ల జేజేఎం కింద నిధులు కోల్పోయాం, శాశ్వత పరిష్కారంగా ప్రాజెక్టులు పూర్తి చేసి ఉండాల్సింది ఏపీ సీఎం ఆదేశించారు. కేవలం రూ. 2 వేల కోట్లు మాత్రమే జేజేఎం గత ప్రభుత్వం కింద ఖర్చు పెట్టింది అని,
ఈ ప్రాజెక్టును కొనసాగించాలని కేంద్రాన్ని కోరామ‌రి పేర్కొన్నారు. పాత స్కీంను 28 వేల కోట్లను ఖర్చు చేసేలా 2028 వరకూ పొడిగించారు, ఇది చాలా సంతోషించదగ్గ విషయ‌మ‌న్నారు. ప్రతీ ఇంటికి సురక్షితమైన తాగునీరు ఇచ్చేలా కనెక్టు చేయండి, స్థానిక నీటి వనరుల నుంచి నీటిని అందించేలా చూడండి అని క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించారు.
రెండేళ్లో జేఎం పథకాన్ని పూర్తి చేసుకుని ప్రతీ ఇంటికీ కుళాయి ఇవ్వండి.పైప్ లైను వేయడం కోసం రోడ్లను తవ్వేసి మళ్లీ సరి చేయకుండా వదిలేస్తున్నారు. ఈ విషయంలో ఖచ్చితంగా ఉండాల్సిందే క‌రాకండి చెప్పారు. మేజిక్ డ్రెయిన్లను కూడా వేగంగా చేయండి. పైబర్ గ్రిడ్ ద్వారా ఇంటర్నెట్ ను ఇవ్వాలని ఆలోచన చేస్తున్నామ‌ని,
ఇల్లు, ఇంటి జాగా కూడా మూడేళ్లలో ఇవ్వాల్సి ఉంది పేర్కొన్నారు. ఉగాదికి 2.50 లక్షల మందికి , జూన్ నెలలో మరికొన్ని ఇళ్లను లబ్దిదారులకు ఇస్తాం అని పేర్కొన్నారు. వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లు కూడా అమల్లోకి వస్తున్నాయి.
ఇంటింటికీ చెత్త సేకరణ కార్యక్రమం చేపట్టాలి అని స్వచ్ఛ సర్వేక్షణ్ మార్చి 15 కు ప్రారంభం అవుతుంది. కనీసం 50 మున్సిపాలిటీలకు అవార్డులు రావాలి ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు క‌లెక్ట‌ర్ల‌తో అన్నారు.
* * *

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version