AP CM Chandrababu | పొలవరం-బనకచర్ల ప్రాజెక్టుల వల్ల ఎవరికీ నష్టం ఉండదు
ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం
Hyderabad : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం కలుగదని, సముద్రంలోకి వెళ్లే నీటినే కరువు ప్రాంతాలకు తరలిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ విషయంపై ‘తెలంగాణలో ఉండేవారితో పాటు తెలుగు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. గోదావరి జలాలను బనకచర్లకు తీసుకెళ్లడం వల్ల ఎవరికీ నష్టం జరగదని పేర్కొన్నారు. సముద్రంలోకి వృథాగా వెళ్లే నీటినే తరలించే ప్రయత్నం జరుగుతుంటే.. దీనిని ఓ పార్టీ రాజకీయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరు మాట్లాడితే తాము వెనుకబడి పోతామని మరికొందరు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టును తాను ఏనాడూ వ్యతిరేకించలేదన్నారు. గోదావరి ఒక్కటే తెలుగు ప్రజలకు శ్రీరామరక్షఅని, గోదావరిపై ప్రాజెక్టులు కట్టాల్సిన అవసరం గురించి తెలిపారు. తెలంగాణలోని కరువు ప్రాంతాలకు కూడా గోదావరి నీటిని తరలించుకోవచ్చని తెలిపారు. నదుల అనుసంధానం జరిగితే సముద్రంలోకి వెళ్లే వృథాజలాలను సమర్థంగా వినియోగించుకోవచ్చని తెలిపారు.
* * *