Cine Actor Nagababu | ఏపీలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నటుడు నాగబాబు పేరు ఖరారు
జనసేన పార్టీ తరుపున పోటీకి సిద్దం
Hyderabad : ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేయడానికి నటుడు నాగబాబుకు అవకాశం దక్కింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తన పార్టీ నుంచి నిలబెట్టడానికి జనసేన పార్టీ తరుపున నాగబాబు పేరు ఖరారు చేశారు. ఆ మేరకు ఆపర్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం ప్రకటించారు. అయితే జనసేన తరుపున ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేయడానికి ఆ పార్టీ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కూటమి నిర్ణయం తీసుకోవాల్సి ఉండడంతో ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబుతో కూడా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. దీంతో నాగబాబు పేరు ఖరారైన నేపథ్యంలో మిగిలిన నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులు ఎవరనే దానిపై కూటమిలో కసరత్తు జరుగుతుంది. ఈ నాలుగు స్థానాలలో డీడీపీ, బీజేపీతో పాటు జనసేన పార్టీలకు చెందిన అభ్యర్థులను కూడా నిలబెట్టే అవకాశాలు పరిశీలిస్తున్నారు. దీంతో ఆయా పార్టీల నుంచి తమకే అవకాశం వస్తుందని ఎవరికీ వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే గత ఎన్నికల ముందు ఎమ్మెల్యే టిక్కెట్ దక్కని వారితో పాటు పలువురు ముఖ్య నాయకులకు ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి టీడీపీ నాయకత్వం గతంలో హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆశావాహులలో చాలా మంది ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ను కలిసి తమ మనుసులో మాట వెలిబుచ్చుతున్నారు. ఆ అవకాశం తమకే ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
* * *