Rtc Special Buses | మ‌హాశివ‌రాత్రికి ప్ర‌త్యేక బ‌స్సులు

  • Rtc Special Buses | మ‌హాశివ‌రాత్రికి ప్ర‌త్యేక బ‌స్సులు
    అధికారుల‌తో స‌మీక్షించిన ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌
    ర‌ద్దీ నియంత్ర‌ణ కోసం ప్ర‌త్యేక అధికారుల‌నూ నియంత్రించాల‌ని ఆదేశాలు
    Hyderabad : వ‌చ్చే మ‌హాశివ‌రాత్రి పండ‌గ నేప‌థ్యంలో శివ భ‌క్తులకు అనుగుణంగా రాష్ట్రంలోని న‌లుమూలూ ఉన్న శివ‌ల‌యాల‌కు ప్ర‌త్యేక బ‌స్సుల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. అందుకు సంబంధించి ఆర్టీసీ అధికారుల‌తో రాష్ట్ర ర‌వాణ శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ స‌మావేశ‌మ‌య్యారు. ప్ర‌త్యేక బ‌స్సుల‌కు సంబంధించిన అంశంపై అధికారుల‌తో చ‌ర్చించారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం మంత్రి మంత్రి అధికారిక నివాసంలో స‌మీక్ష నిర్వ‌హించారు. మహా శివరాత్రి సందర్భంగా భక్తులు అధికంగా వెళ్ళే వేములవాడ , శ్రీశైలం , ఏడుపాయల , కీసర పాలకుర్తి దేవాలయాలకు వెళ్ళే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించాలని మంత్రి ఆదేశించారు. గత సంవత్సరం కంటే భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున అదనపు బస్సులు నడిపేలా ప్రణాళికలు చేప‌ట్టాల‌న్నారు. బస్ స్టాండ్ ల వద్ద అధిక రద్దీ ఉన్నప్పుడు ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఆర్టీసీ ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేయాలన్నారు. సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ,ఈడి మునిశేఖర్ , సీటీఎం శ్రీధర్ , ఫైనాన్స్ అడ్వైజర్ విజయ పుష్ప ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.
    * * *

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version