Brs chief Kcr | ఏడాది కాంగ్రెస్ పాల‌న‌లో మ‌న చిత్త‌శుద్ధి ఏంటో ప్ర‌జ‌ల‌కు అర్థ‌మైంది

Brs chief Kcr | ఏడాది కాంగ్రెస్ పాల‌న‌లో మ‌న చిత్త‌శుద్ధి ఏంటో ప్ర‌జ‌ల‌కు అర్థ‌మైంది
బీఆర్ఎస్ ఉద్య‌మ స్ఫూర్తి క‌లిగి ఉంది
ఈ నెల 27న ర‌జ‌తోత్స‌వ స‌భ‌కు స‌న్నాహాలు
స‌భ‌ను విజ‌య‌వంతం చేయ‌డంలో పార్టీ నేత‌ల‌కు దిశా నిర్దేశం చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌..
Hyderabad : బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ, రజతోత్సవ మహాసభ నేపథ్యంలో.. ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల ముఖ్యనేతలతో పార్టీ అధినేత కేసీఆర్ గారి అధ్యక్షతన సన్నాహక సమావేశమ‌య్యారు. ర‌జ‌తోత్స‌వ స‌భ‌ను విజ‌య‌వంతం చేయ‌డం కోసం ఆ పార్టీ నేత‌ల‌కు ఆయ‌న దిశా నిర్దేశం చేశారు. ఈ మేర‌కు శ‌నివారం బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి నివాసంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో స‌హా ఆ మూడు నియోజ‌క వ‌ర్గాల‌కు చెందిన ముఖ్య నేత‌లు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ పట్ల త‌మ‌కున్న ఆవేదన మరో పార్టీకుండద‌న్నారు. ప్రజల ఆకాంక్షలను ఉద్యమ స్పూర్తి కలిగిన బిఆర్ఎస్ పార్టీ మాత్రమే అర్థం చేసుకోగలద‌ని తెలిపారు. ఏడాదిన్నర కాంగ్రేస్ పాలనలో ప్రజలకు మన చిత్తశుద్ది ఏంటో స్పష్టం గా అర్థమైంద‌ని తెలిపారు. తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో వారు అర్థం చేసుకుంటున్నార‌ని పేర్కొన్నారు. రజతోత్సవ సభకు అంచనాకు మించి లక్షలాదిగా తరలివస్తార‌ని, ఆయ‌న విశ్వాసం వ్యక్తం చేశారు. నాడు తెలంగాణను ఒక విఫల ప్రయోగంగా తేల్చాలని కుట్రలు పన్నిన ప్రతీప శక్తులే నేడు మన పాలనను తప్పు పడుతూ నిందలేయ చూస్తున్నాయ‌ని ఆయ‌న అన్నారు. తెలంగాణ ప్రజలకు పాలేవో నీల్లేవో స్పష్టంగా తెలిసి పోయింద‌న్నారు. సాగునీరు తాగునీరు విద్యుత్తు వంటి మౌలిక వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందడం శోచనీయమ‌న్నారు.
రజతోత్సవ సభ అనంతరం పార్టీ సభ్యత్వ ప్రక్రియ ప్రారంభ మ‌వుతుంద‌న్నారు. అనంతరం గ్రామ స్థాయినుంచి కమిటీల నిర్మాణం ఉంటుంద‌న్నారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయాల కేంద్రంగా శిక్షణా తరగతులు ఉంటాయ‌ని తెలిపారు. జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షులు ముఖ్య నేతలతో కొనసాగుతూ.. నేటితో స‌న్నాహాక స‌మావేశాలు ముగిశాయ‌న్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పార్టీ ముఖ్య నేతలు..
ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ మాజీ మంత్రులు, సిహెచ్ లక్ష్మారెడ్డి, ఎస్ నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యే లు అంజయ్య యాదవ్,చిట్టెం రామ్మోహన్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి,
బీరం హర్షవర్ధన్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్, మాజీ ఎంపీ రావుల చంద్ర శేఖర్ రెడ్డి,పార్టీ నేతలు డా. ఆంజనేయ గౌడ్, హనుమంతు నాయుడు, గట్టు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్య నేతలు..
మాజీ మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే లు… కందాల ఉపేందర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, బానోత్ మదన్ లాల్, బానోత్ హరిప్రియ నాయక్, రేగ కాంతారావు, మెచ్చా నాగేశ్వర్ రావు, వనం వెంకటేశ్వర రావు,లింగాల కమల్ రాజ్,
తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలు…
మాజీ మంత్రి ఎమ్మెల్యే జి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ కోటి రెడ్డి, మాజీ ఎమ్మేల్యేలు రామావత్ రవీంద్ర కుమార్, నోముల భగత్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లమోతు భాస్కర్ రావు, బొల్లం మల్లయ్య యాదవ్, బడుగుల లింగయ్య యాదవ్, పార్టీ సీనియర్ నేత విజయ సింహా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఆశన్న జీవన్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, పార్టీ రాష్ట్ర నాయకుడు కల్వకుంట్ల వంశీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.
* * *

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version