Telangana MLCs News | నేటితో ముగియనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ నామినేషన్లు
పార్టీల వారీగా అభ్యర్థులు ఖరారు
నామినేషన్లకు నేటితో ముగియనున్న గడువు
ఈ నెల 20 పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు
Hyderabad : రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు సోమవారంతో ముగుస్తుంది. దీంతో పార్టీల వారీగా పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేస్తూ ఆయా పార్టీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థులు పోటీలో నిలబెట్టారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకరు, సీపీఐ నుంచి ఒక్కరు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులలో అద్దంకి దయాకర్, శంకర్‌నాయక్‌తో పాటు అన్యూహ్యంగా విజయశాంతిని ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారు చేస్తు కాంగ్రెస్ అధీష్టానం నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ ఆ పార్టీ అధీష్టానం నిర్ణయం తీసుకుంది. అలాగే సీపీఐ పార్టీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యంను ఖరారు చేశారు. ఈ ఐదు మంది అభ్యర్థులు సోమవారం గడువు లోగా తమ నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలో నిలుచోవడానికి సోమవారం వరకు నామినేషన్లు దాఖలు చేస్తారు. ఈ నెల 11న నామినేషన్ దరఖాస్తులు తనిఖీ చేస్తారు. నామినేషన్ల ఉపసంహారణ కు ఈ నెల 13 వరకు గడువు విధించారు. కాగా ఈ నెల 20 పోలింగ్ నిర్వహించి, అదే రోజు సాయంత్రం పొలైన ఓట్లు లెక్కిస్తారు. అయితే ఈ నెల 29 న ప్రస్తుతం కొనసాగుతున్న ఐదు మంది ఎమ్మెల్సీల పదవి కాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించడం అనివార్యం అయింది.
* * *