Brs Working President Ktr | కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు అంబేద్కరే కారణం
దేశంలో అందరూ భాగుండానేదే ఆయన ఆలోచన
దళితబంధు లాంటి పథకాన్ని అమలు చేసిన దమ్మున్న నాయకుడు కేసీఆర్
తెలంగాణ భవన్‌లో అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన కేటీఆర్
Hyderabad : దేశంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనలే కారణమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఆధునిక భారతావనికి పునాదులు వేశారని ఆయన తెలిపారు. బాబాసాహెబ్ ఆలోచన, ముందు చూపు చాలా గొప్పదని వెల్లడించారు. దేశంలో అందరూ బాగుండాలన్నదే అంబేద్కర్ ఆలోచన అని అన్నారు . అంబేద్కర్ ఆలోచనను తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఆచరణలో పెట్టారన్నారు. దళితబంధు లాంటి పథకాన్ని అమలు చేసిన దమ్మున్న నాయకుడు కేసీఆర్ తెలిపారు. అబద్ధపు ప్రచారంతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నదని, దళితులకు అంబేద్కర్ అభయహస్తం ఇంకెప్పుడు ఇస్తారు అని కేటీఆర్ ప్రశ్నించారు. రూ.12 లక్షల కాదుకదా.. కనీసం12 రూపాయలు కూడా ఇవ్వరని విమర్శించారు. ఈ మేరకు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేటీఆర్.. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు అంబేద్కర్ ఆలోచనలే కారణమన్నారు. ప్రజాస్వామ్యంలో మందబలంతో అవతలివారి గొంతు నొక్కేయడం ఉండకూడదని అందరితో కొట్లాడి కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు ఉన్న రాష్ట్రం అనుమతి ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంటూ రాజ్యాంగంలో ఆర్టికల్ 3ని పొందుపర్చారని తెలిపారు. మనం ఇప్పుడు తెలంగాణలో మాట్లాడుతున్నామంటే దానికి కారకుడు ఒకేఒక్కరు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అని చెప్పారు. బాబాసాహెబ్ ఆలోచన, ముందు చూపు చాలా గొప్పదన్నారు.
“అంబేద్కర్‌ను కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమని, దళిత బిడ్డ కాబట్టి దళిత జాతికి మాత్రమే నాయకుడు అన్నట్టుగా కొందరు ఆయనను తక్కువ చేసే ప్రయత్నం చేస్తారు. స్వాతంత్య్రం కోసం మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, వారితోపాటు కొట్లాడిన వేలాది లక్షలాది మంది ఎలాగైతే కీలకపాత్ర పోషించారో, స్వాతంత్య్రానంతరం ఆధునిక భారతావనికి అంబేద్కర్ పునాది వేసిన అద్భుతమైన నాయకుడు అంబేద్కర్.
అంబేద్కర్ నమ్మిన సిద్దాంతం బోధించు, సమీకరించు, పోరాడు అనే తత్వాన్ని అర్థం చేసుకుని, ఆచరణలో పెట్టిందే కేసీఆర్. పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి లక్షల సంఖ్యలో ప్రజలను సమీకరిస్తూ, వారికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను బోధిస్తూ, వివరిస్తూ, తెలంగాణకు అన్యాయం జరిగితే పోరాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యంగం ఆధారంగా రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కేసీఆర్. అలా సాధించుకున్న రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా కార్యక్రమాలు అమలుచేశా4రు.
వెయ్యి మైళ్ల ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే మొదలైతది. ఆ వెయ్యి మైళ్ల ప్రయాణానికి భారతదేశ స్వాతంత్య్రానంతరం మొదటిసారి ఒక స్వాప్పికుడిలా ఆలోచించి దళితులు ధనికులు ఎందుకు కావొద్దని ఆలోచించిన నాయకుడు కేసీఆర్. దళితబంధు పథకంతో లక్షలాది మంది జీవితాలను మార్చలేకపోవచ్చు. కేసీఆర్ లాంటి నాయకుడి చేతిలో అపరిమితమైన వనరులు ఉంటే చాలా చేస్తుండే. కానీ పరిమితమైన వనరులతో ఉన్నంతలో ఏడాదికి ఇన్ని వేలమందికి అని దళితబంధు పథకం తెచ్చినం. దానికి విపరీత అర్ధాలు తీసి కొందరు చిల్లరగాళ్లు రాజకీయ లబ్ధి పొందొచ్చు. కానీ దళితబంధులాంటి పథకం ప్రవేశపెట్టినందుకు కేసీఆర్ సైనికుడిగా గర్వపడుతున్నా. వారికి సెల్యూట్ చేస్తున్నా. అంబేద్కర్ పేరువాడుకుని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని అడగాలి. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరుతో దళితులకు రూ.12 లక్షలు ఇస్తామని చేవెళ్లలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో చెప్పించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని అడుగుతున్నా.. రెండు బడ్జెట్లు పెట్టినవ్. ఇంకెప్పుడిస్తవ్. అంబేద్కర్ అభయ హస్తం. రూ.12 లక్షలు కాదుకదా రూ.12 కూడా ఇవ్వడని అందరికీ అర్థమైపోయింది. డబుల్ బెడ్‌రూమ్ పథకం కింద ఎస్సీ ఎస్టీలకు రూ.6 లక్ష ఇస్తానని చెప్పిండు. బాబాసాహెబ్ జయంతి సందర్భంగా నీ రూ.6 లక్షల మాట ఏమైందని అడుగుతున్నా. ఖర్గే ఎక్కడున్నడు, రాహుల్ గాంధీ ఎక్కడున్నడు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో మీరు చెప్పిన కథలన్నీ ఏమైనయ్.
ఎస్సీ, ఎస్టీలకు 28 శాతం ప్రభుత్వ కాంట్రాక్టుల్లో వాటా కలిపిస్తామని చెప్పారు.. ఇకెందుకు చేయలేదు రేవంత్ రెడ్డి?. అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని చెప్పిన హామీ ఏమైంది?. ఎస్సీ, ఎస్టీలకు విద్యాజ్యోతిల పథకం కింద 10వ తరగతి పాస్ అయితే రూ.10 వేలు, ఇంటర్ పాస్ అయితే రూ.15 వేలు, గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే రూ.25 వేలు, పీజీ చేస్తే లక్ష, పీహెచ్డీలు చేస్తే రూ.5 లక్షలు ఇస్తామన్నారు.. ఏమైందని నేడు అడుగుతున్నా. రేవంత్ రెడ్డి దళిత సమాజానికి, ప్రజలకు సమాధానం చెప్పాలి. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదల వ్యతిరేక ప్రభుత్వం. పేదలకు రూ.2000 పెన్షన్ ఇస్తే, రుణమాఫీ చేస్తే, ఉచిత కరెంట్ ఇస్తే మోడీకి నచ్చదు కానీ రూ.16.50 లక్షల కోట్లు పెద్ద పెద్ద కార్పొరేట్లకు మాఫీ చేస్తే మోదీకి నచ్చుతుంది. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీ తుఫాన్ వేగంతో అధికారంలోకి వస్తుంది’ అని కేటీఆర్ అన్నారు.
-
* *