Stanly College of Engineering | నాణ్యమైన విద్యకు పెట్టింది పేరు `స్టాన్లీ`
ఏడు ఎమర్జింగ్ కోర్సులతో..మంది వాతావరణంలో
స్టాన్లీ కాలేజీలలో 3500 మంది విద్యార్థులు, 140 మంది ఫ్యాకల్టీ..
33 యూనివర్సిటీలకు చెందిన ర్యాంకర్లు
యూనివర్సిటీ కెబంగసన్ మలేషియాతో ఒప్పందాలు
Hyderabad : రాష్ట్రంలోని ఇంజినీరింగ్ విద్యలో ` స్టాన్లీ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ డెక్నాలజీ ఫర్ ఉమెన్` ఒక వెలుగు వెలుగుతోంది. 2008 సంవత్సరంలో ఏర్పాటు చేసిన ఈ కాలేజీ దిన దినాభివ్రుద్ధి చెందుతూ.. రాష్ట్రంలో తనదైన ముద్ర వేసుకుంది. ఈ కాలేజీ హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో ఉన్న చారిత్రాత్మక స్టాన్లీ కళాశాల క్యాంపస్‌లోని 6 ఎకరాల విశాలమైన క్యాంపస్‌లో ఒక విద్యా దేవాలయం స్థాపించబడింది. ఈ కాలేజీలు ఏర్పాటు నాళ్లలో తొలుత నాలుగు కోర్సులతో ప్రారంభమైన కాలేజీ నేడు ఏఐఎంఎల్, వంటి ఎమర్జింగ్ టెక్నాలజీ కోర్సులు అందించడంలో ముందు వరుసలో నిలుస్తుంది.
రేటింగ్ తో దూసుకు పోతున్న స్టాన్లీ :
ప్రముఖ వెబ్సైట్లలో ఈ కాలేజీకి 4.3 రేటింగ్ నమోదైంది. కాలేజీలలో ఇంజినీరింగ్ చదువుకున్న అమ్మాయిలలో 700 పైగా ఉద్యోగాలొచ్చాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ప్రముఖ ఐటీ కంపెనీలతో ఈ కాలేజీ యాజమాన్యం ఒప్పందాలు చేసుకుంది. ప్రతి సంవత్సరం 4.2 లక్షల నుంచి రూ.30 లక్షల ప్యాకేజీ ఉండే విధంగా ఇక్కడ విద్యార్థులు ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు పొందారు. నాణ్యమైన విద్యే పరమావధిగా ముందుకు సాగుతున్న స్టాన్లీ కాలేజీలో ప్రస్తుతం 3500 పైగా విద్యార్థులు చదువుతున్నారు. 140 మంది ఫ్యాకల్టీతో అందరికీ అందుబాటులో ఉంటుంది.
కాలేజీలో ప్రశాంత వాతావరణ..
స్టాన్లీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది, వారి మానసిక సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. విద్యార్థుల ముఖంపై చిరునవ్వుతో కఠినమైన ప్రపంచ పోటీని ఎదుర్కోవడానికి, విజయం సాధించడానికి వారిని అన్ని విధాలుగా సన్నద్ధం చేస్తుంది. స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ మెథడిస్ట్ చర్చ్ ఆఫ్ ఇండియా మద్దతుతో ఏర్పాటైంది. ఈ కాలేజీ క్యాంపస్‌లో ఇంజనీరింగ్ కళాశాల అనే దార్శనికతను నిజం చేయడంలో కీలక పాత్ర పోషించింది.
స్టాన్లీ కళాశాల ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది. దీనిని AICTE, న్యూఢిల్లీ ఆమోదింతో.. తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది.
**అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులు..
ఈ కాలేజీలో ప్రస్తుతం బీటెక్‌లో ఏడు రకాల కోర్సులు అందుబాటులోకి తెచ్చారు.
*అర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్
* కంప్యూటర్ ఇంజినీరింగ్
* కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీ ఎస్ ఈ)
* ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈ సీ ఈ)
* ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ ( ఈఈఈ)
* ఇన్ఫరేషన్ టెక్నాలజీ (ఐటీ)
* అర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ( ఏఐఎంఎల్)