Sweet box for New girl baby | అమ్మాయి పుడితే స్వీట్ బాక్సు..
ఇంటికి వెళ్ల స్వీటుబాక్సుతో శుభాకాంక్షలు తెలుపనున్న అధికారులు
`గర్ల్ ఫ్రైడ్` పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఖమ్మం జిల్లా కలెక్టర్
Hyderabad : ఖమ్మం జిల్లాలో `గర్ల్ ఫ్రైడ్` పేరుతో వినూత్న కార్యక్రమానికి ఆ జిల్లా కలెక్టర్ శ్రీకారం చుట్టారు. జిల్లాలో అడపిల్ల పుట్టిన ఇంటికి జిల్లా అధికారులు వెళ్లి స్వయంగా స్వీట్ బాక్సు అందించి శుభాకాంక్షలు తెలుపనున్నారు. అమ్మాయి పుట్టడం శుభ సూచకమని ప్రచారం కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. వచ్చే వారం నుంచి `గర్ల్ ప్రైడ్` ప్రకటనలు కూడా ప్రారంభించనున్నారు. అలాగే పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల ఇండ్లకు ప్రతి రోజు సాయంత్రం అధికారులు వెళ్లి పరీక్షల సన్నద్ధతను గమనించి, తల్లిదండ్రులతో మాట్లాడాలని ఆ జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ మేరకు క్షేత్ర స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఆడ పిల్లల పట్ల వివక్ష కొనసాగుతుంది. ఈ క్రమంలో కొందరు అడ పిల్ల పుట్టిన వెంటనే చెత్త బుట్టలకు పరిమితం చేస్తున్నారు. దీంతో మగపిల్లవారు పుడితే కంటికి రెప్పలాగా చూసుకుంటున్నారు. ఈ వివక్షపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్న సదుద్దేశంతో ఖమ్మం జిల్లా కలెక్టర్ ఈ మేరకు వినూత్న నిర్ణయం తీసుకోవడంపై ఆ జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
* * *